*గాంధీజీ ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి*

మునగాల, అక్టోబర్02 (జనంసాక్షి): జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొప్పుల వీరమ్మ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగన్యులని, ప్రజలు గాంధీజీని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారని, సత్యము అహింసలు గాంధీజీకి నమ్మిన సిద్ధాంత మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం గాంధీజీ ఆయుధాలని అన్నారు. మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు నడుంబించాలన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం పాలకులు కృషి చేయాలని కోరారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు జెట్టి రామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఇంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ రుక్కారావు, దస్తగిరి పాషా, నాగరాజు, వీరయ్య, అంగన్వాడి టీచర్ సునీత, షబానా పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.