గాంధీ జీవిత చరిత్రను తిలకించిన అమ్మాపురం విద్యార్థులు.

తొర్రూరు 11 ఆగష్టు (జనంసాక్షి)మాత్మా గాంధీ తన జీవితాన్ని దేశానికి ఎలా అంకితం చేశారో భవితరాలు తెలుసుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని,అమ్మా పురం సర్పంచ్ కడెం యాకయ్య,పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణలు అన్నారు.స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో గురువారం మండలంలోని అమ్మాపురం జెడ్పిఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాల నుండి సుమారు 200 మందికి పైగా విద్యార్థులు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో సర్పంచ్ కడెం యాకయ్య,పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో గాంధీ జీవిత చరిత్ర సినిమాను విద్యార్థులు ఉచితంగా వీక్షించారు.ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ.మహాత్మా గాంధీ చేసిన అహింస పోరాట విశేషాలను తెలిసేలా పిల్లల్లో అవగాహన కల్పించేందుకు గాంధీ చిత్ర ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గాంధీజీ అవలంబించిన సత్యం,అహింస విధానాలు అందరికీ మార్గదర్శకాలని,వాటిని ఇప్పటినుండే విద్యార్థులు అలపర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుమార్,అమ్మాపురం పంచాయతీ సెక్రటరీ శ్రావణి,పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.