గాంధీ సినిమా చూసిన డాన్ బాస్కో విద్యార్థులు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 19(జనం సాక్షి)
వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా పి వి ఆర్ ఎస్ 2 సినిమాస్ వరంగల్ లో డాన్ బాస్కో నవజీవన్ విద్యార్థులకు గాంధీ సినిమాను చూపించడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్ సి ఫ్రెండ్లీ విజిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భాగంగా ఇందులో చిట్టిమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తోట పూర్ణచందర్, అనంతుల కుమారస్వామి, మంచాల విజయ్ కుమార్, యాద శ్రీనివాస్ ,పాల సత్యనారాయణ, దివ్వెల పూర్ణచందర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.