గాయత్రి ఆలయం లో ఘనంగా కలశ స్థాపన
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 26( జనం సాక్షి): శ్రీ శ్రీ శ్రీ పంచముఖ వేద గాయత్రి ఆలయములో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దయానిధి అక్కినేపళ్లి వసంత చార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ప్రదీప్ శాస్త్రి మంత్రోచ్ఛరణతో వైభవంగా సోమవారం కలశ స్థాపన ప్రథమ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిష్టగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక పూజలు జరుపుకుంటారు.మొదటి రోజు పూజ కార్యక్రమం లో పాలోజు వీరాచారి – కుమారి, దోసపాటి వెంకటేశ్వర్లు – లక్ష్మి, గోడ ముక్కల నాగిరెడ్డి – రమణమ్మ, కంభం పాటి సత్యనారాయణ రాజు – సంధ్య, మద్ది వెంకట రెడ్డి – నిర్మల, నాదెళ్ల ముత్యాల రావు – సీతా కుమారి దంపతులు కూర్చున్నారు.తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ,అటుకుల బతుకమ్మ,ముద్దపప్పు బతుకమ్మ,నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ,వేపకాయల బతుకమ్మ,వెన్నముద్దల బతుకమ్మ,సద్దుల బతుకమ్మ వరుసగా తొమ్మిది ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేకత ఉంటుందని తెలిపారు.గాయత్రి అమ్మవారు కొంగు బంగారమై భక్తుల కోరిన కోర్కెలు తీర్చే జగన్మాత కొలువై ఉన్నారు భక్తులకు ఆయువు ఆరోగ్య ధన కనక వస్తు వాహన యోగం సిద్దించాలని నిత్యం అమ్మవారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగస్వాములైన దాతలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.