గీతా ధర్మ ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో పారాయణం
పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి): మణుగూరు, సుందరయ్యనగర్లోని తునికీ సత్యాగ్రహచారి, శారద స్వగృహంలో సోమవారం పవిత్రమైన ఏకాదశి సందర్భంగా గీతాధర్మప్రచారసేవాసమితి వారి ఆధ్వర్యంలో ఉదయం 9:00-1:30 గంటల వరకు. శ్రీకృష్ణ పరమాత్మ అష్టోత్తర శతనామార్చనపూజ, సంపూర్ణ భగవద్గీత పారాయణం,సత్స్ంగం నిర్వహించారు. . ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు నెట్టెం రాధాకృష్ణ మాట్లాడుతూ గీతాధర్మప్రచార సేవాసమితికి సత్యాగ్రహ చారి శారదలు విరాళంగా 2016 రూపాయలను అందజేశారు.అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం వితరణ సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 9:00-12:00 గంటల వరకు. గుట్టమల్లారంలోని శ్రీ భద్రకాళీ ఆలయంలో భగవద్గీత, శ్రీలలితా సహస్రనామ పారాయణం, భజనలు నిర్వహించడం జరుగుతోంది.కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై ఆశీర్వాదం తీసుకోవాలని సమితి అధ్యక్షుడు నెట్టెం రాధాకృష్ణ తెలిపారు.