గుప్తనిధుల కోసం నరబలి యత్నం
నెన్నెల : ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలోని కబ్జి గ్రామంలో గుప్త నిధుల కోసం దుండగులు నరబలి యత్నించారు. అయితే గ్రామస్థులు దీన్ని అడ్డుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.