గురువులను గుర్తుంచుకొని సన్మానించడం అభినందనీయం.

మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య.

తొర్రూరు సిద్ధార్థ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం.

తొర్రూరు 07 అక్టోబర్ (జనంసాక్షి )
విద్య నేర్పిన గురువులను గుర్తుంచుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానించి గురువులను సన్మానించడం అభినందనీయమని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ ప్రైవేటు పాఠశాలలో 2005-2006 పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు గురువారం పాఠశాలలో సమావేశమై వారికి విద్య నేర్పిన గురువులను శాలువాతో సన్మానించి.. పాదాభివందనం చేసి గురువుల నుండి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ 16 సంవత్సరాల క్రితం 10వ తరగతి విద్యార్థులు సమావేశమై గురువులను కూడా ఆహ్వానించి సన్మానించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. నేటి సమాజంలో నిమిషం కూడా తీరికలేని మనుషుల జీవితంలో గురువులను గుర్తించి పాదాభివందనం చేయడం సిద్ధార్థ పాఠశాలలో చదివిన విద్యార్థులకు గురువుల నేర్పించిన క్రమశిక్షణ వల్లనే సాధ్యమైందని పాఠశాలల్లోని ఉపాధ్యాయులను పాఠశాల యజమాన్యాన్ని అభినందించారు. అనంతరం పాఠశాలలో చదివిన తూర్పాటి రవి టిఆర్ఎస్ పార్టీలో ముందుకు సాగుతూ తన భార్యను కౌన్సిలర్గా గెలిపించి పట్టణంలో సేవలందిస్తున్న సందర్భంగా రవిని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళ కార్యక్రమంలో పాఠశాల యజమాన్యంతో పాటు ప్రధానోపాధ్యాయులు జయప్రకాష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వెంకన్న, భాస్కర్, యాదగిరి, సోమ సుందర్, రాజు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.