గుల్జార్‌ కథ-మగవాడు

గుల్జార్‌ కవిగా ప్రసిద్ధుడు. మరో విధంగా చెప్పాలంటే గొప్ప సృష్టికర్త. సినిమా పాటలే కాదు. గజల్స్‌ కూడా రాశాడు. సినిమా లకి స్క్రీన్‌ప్లేలు రాశాడు. సినిమాలకు దర్శకత్వం వహించాడు. పిల ్లల కోసం ఎన్నో రచనలని చేశాడు. సినిమాలకు మాటలు రాశాడు. యాభై సంవత్సరాలుగా సినిమా ప్రపంచంలోనే కాదు భారతదేశ సాహితీ చరిత్రలో అతని ముద్ర, అతని అడుగుజాడ వుంది. అతని గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అతని చరిత్రని కూడా ఇద్దరు వ్యక్తులు రాశారు. ఒకరు ఆయన కుమార్తె మేఘన. రెండో వ్యక్తి సైబాల్‌ చటర్జీ.గుల్జార్‌ పుట్టింది దీనాలో. ప్రస్తుతం అది పాకిస్తాన్‌ దేశంలో వుంది. అతని చిన్నతనం అక్కడ గడిచింది. ఆ తరువాత ఢిల్లీలో విద్యాభ్యాసం చేశాడు. అతని తండ్రి వ్యాపారం చేసేవాడు. రాత్రి భోజనం అయిన ఇంట్లో కాకుండా తండ్రి స్టోర్‌రూంలో అత ను నివసించేవాడు. ఆ రాత్రి సమయం గడువడానికి పుస్తకాలని కిరాయికి తెచ్చుకొని చదివేవాడు. ఆ విధంగా చదవడం మీద అతనికి అభిరుచి ఏర్పడింది. అదొక వ్యసనంగా మారింది. స్కూల్లో చదువుతున్నప్పుడు అతను రచనలు చేయడం మొదలు పెట్టాడు. అవి కొన్ని ఉర్దూ దినపత్రికల్లో ప్రచురితమైనాయి కూడా. గుల్జార్‌ తండ్రికి అతన్ని ఓ పెద్ద వ్యాపారవేత్తను చేయాలని వుండేది. అందు కని అతన్ని అతని సోదరుని దగ్గర వ్యాపారంలో సహాయం చేయడా నికి బొంబాయికి పంపించాడు. కానీ వ్యాపారం అతనికి రుచిం చలేదు. కవి, రచయిత కావాలని అనుకున్నాడు గుల్జార్‌.చాలా మంది అతన్ని ఓ సినిమా రచయితగా చూస్తారు. కానీ అది సరైంది కాదు. అతను ఎన్ని మంచి కవితలు రాశాడో అంతకన్నా మంచి పాటలు రాశాడు. అంతకన్నా మంచి మాటలు రాశాడు. గజల్లు రాశాడు. పిల్లల కోసం రచనలు చేశాడు. అతని రచనలు పఠితల హృదయాలని తాకుతాయి. ఓ గాఢ ముద్రని పాఠకుల మీద వేస్తా యి. గుల్జార్‌ కవిత్వంలోని ప్రతీకలు, పదాలు తేలికగా వుండి పాఠ కుల గుండెలని హత్తుకుంటాయి. కవిత్వం ఎంత పదనుగా వుం టుందో అతని వచనమూ అంతే పదునుగా వుంటుంది. ఒక్క వాక్యంలో గుండెల్ని పిండే విధంగా చెప్పగలడు. గుల్జార్‌, రాఖీలు ఎందుకు విడిపోయారో తెలియదు కానీ రాఖీ అతని జీవితంలో వుంది. గుల్జార్‌ రాసిన చాలా పుస్తకాలు మరీ ముఖ్యంగా కథలు పుస్తకాలు రాఖీకి అంకితం ఇచ్చాడు. ఆ అంకితం ఒక్కో వాక్యంలో వుంటుంది. ‘నా జీవితంలోని అతి పొడవైన చిన్న కథ రాఖీకి’ (ఖీశీతీ =aసష్ట్రవవ, ుష్ట్రవ కూశీఅస్త్రవర్‌ ూష్ట్రశీత్‌ీ ూ్‌శీతీవ శీట ఎవ శ్రీఱటవ). ఇది ఒక్క చిన్న వాక్యం. దీన్ని వివరిస్తే చాలా పెద్ద కథ అవుతుంది. రాఖీ అతని జీవితంలో వున్నది కొంతకాలం. ఒక విధంగా చెప్పాలంటే చిన్న కథ. కానీ అతని జీవితంలో అతి పొడవైన చిన్న కథ. మర్చిపోలేని కథ. చిన్న వాక్యాలలో అనంతభావాలని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఈ విషయాన్ని చెప్పవచ్చు. కథలు చిన్నగా వుండాలి. చిన్న కథలు చాలా పెద్ద ఆలోచనని ఇవ్వాలి. గుల్జార్‌ కథలు ఇలాగే వుంటాయి. స్త్రీవాదం, అస్తిత్వ వాదనలు వున్నాయి. అలాంటి ఒక కథ గురించి ఈ వారం మాట్లాడుకుందాం. ఆ కథ పేరు ‘మగవాడు’. మగవాడు ఎవరైనా ఒకేలా వుంటారు. వారి దృష్టి, ఆలోచన ఒకే విధంగా వుంటాయి. అప్పుడే యుక్తవయస్సులోకి వచ్చిన కుర్రవాడు కావొచ్చు. పెద్దవాడు కావొచ్చు. విశ్వజనీనంగా మగవాడి దృష్టి, బుద్ధి ఒకే విధంగా వుంటుందని అనడానికి తార్కాణంగా ఈ కథ వుంటుంది.కథలు మొదలు కావడం దగ్గర నుంచి చివరి వరకూ ఎలా చెప్పాలో గమనించడానికి నిదర్శనంగా గుల్జార్‌ కథలు వుంటాయి. ఈ కథల ని రచయితలు ఈ కోణంలో చదవాల్సి వుంటుంది.

తన గర్భంలో కొంత కొంత తెలుస్తుంది. ఈ విషయం కొడుక్కి ఎలా చెప్పాలి అన్న వాక్యంతో కథ మొదలువుతుంది. వాడు హాస్టల్‌ నుంచి వస్తాడు దీని గురించి వాడు అడిగితే ఏం చెప్పాలి? ఈ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా రమ భయభ్రా ంతురాలైపొయ్యేది. కవిల్‌ ఆమె కొడుకు భర్త కూడా కాదు. వాడికి ఎలాంటి వివరణ ఇవ్వాలి? ఇది కథ ప్రారంభం.

స్త్రీ ఏం చేసినా దానికి వివరణ ఇవ్వాలి. అది మగవాడికి. కొన్ని సందర్భాల్లో అతను తండ్రి కావొచ్చు. మరికొన్ని సందర్భాల్లో అతను భర్త కావొచ్చు. చివరికి కొడుకు కూడా కావొచ్చు. ఈ పరిస్థితి మగవా డికి వుండదు. రమ భర్త భక్షి. అతను కాంటా దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలాంటి వివరణ భార్యకు ఇవ్వాల్సి వచ్చేది కాదు. ఆమె ఏమైనా వివరణని అడిగితే ఇంట్లో వంట సామాను బ్రద్దలై పొయ్యేది. ఇంకా ఆమె ప్రశ్నిస్తే ఆమెకు దెబ్బలు కూడా పడేవి. ఈ వాతావరణం కపిల్‌ చూడొద్దని అతన్ని కాస్త దూరంగా వున్న నానిటాల్‌లోని బోర్డింగ్‌ స్కూల్లో పెట్టి చదివించారు.

భక్షి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతను పూర్తిగా కాంతవ లలో పడ్డాడు. అతని జీతం డబ్బులు సరిపోకపోవడంతో రమ కూడా ఉద్యోగంలో చేరింది. బక్షి మిత్రుడు రామన్‌ ఈ ఇద్దరి వ్యవహారంలో జోక్యం చేసుకొని పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది ఎలాంటి ఫలితం ఇవ్వదు. రమ తండ్రి ఓసారి వీళ్ల దగ్గరికి వస్తాడు. విషయం తెలుసుకునే ప్రయ త్నం చేస్తాడు. తమ మధ్య ఏమీ లేదని, కపిల్‌ దూరంగా వుండటం వల్ల తాను మనోవ్యథతో వున్నానని చెబుతుంది. ఆ తరువాత భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటాయి. విడాకులు కూడా తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇద్దరూ కపిల్‌కి చెప్పరు.బక్షి దూరంగా బదిలీ చేసుకొని వెళ్లిపోతాడు. కపిల్‌ని భార్య అధీనంలో వుంచడానికి అంగీకరిస్తాడు. కాంతా గురించి ఏం చెప్పాలో తెలియక అంగీకరిస్తాడు. కొంతకాలం తర్వాత కాంతా అతని నుంచి దూరంగా వెళ్లిపోతుంది. కానీ రమ, బక్షి ఇద్దరూ మళ్లీ కలవరు.తన తండ్రి దూరంగా వుంటున్నాడన్న విషయాన్ని కపిల్‌ ఓసారి ఇంటికి వచ్చినప్పుడు గమనించి తల్లిని ప్రశ్నిస్తాడు. ఆమె ఏదో జవాబు చెబుతుంది. ‘పర్వాలేదమ్మా! నేనున్నానుగా! నిన్ను చూసుకోవడానికి’ అంటాడు. పది సంవత్సరాలు వున్న కుర్రవాడు అంత పెద్ద మాటలు చెప్పినందుకు రమ ఆశ్చర్యపోతుంది. అతన్ని గుండెకు హత్తుకుంటుంది.అతను మళ్లీ హాస్టల్‌కి వెళ్లిపోతాడు. తన భర్త స్నేహితుడు రామన్‌తో కలిసి ఒకటి రెండు సార్లు హాస్టల్‌కి వెళ్లి చూసివస్తుంది. అతనికి ఏం చెప్పాలో ఆమెకు తోచదు. కపిల్‌కు 12 సంవత్సరాలు వస్తాయి. సెలవుల్లో ఇంటికి వస్తాడు. అతను వస్తున్నాడని తెలిసి తన గర్భం కన్పించ కుండా వుండటానికి లూజు డ్రెస్సులు వేసుకుంటుంది. అప్పుడైనా అతనికి అన్ని విషయాలు చెబుదామని అనుకుంటుంది కానీ చెప్పదు. చిన్న పిల్లవాడు ఎందుకులే అని అనుకుంటుంది. అతను గమనిస్తే తాను లావయ్యానని చెబుదామని అనుకుంటుంది. అంతగా అవసరమైతే రామన్‌ని రిజిస్టర్డ్‌ వివాహం చేసుకున్నానని చెబుదామని నిర్ణయించుకుంటుంది.

తన గర్భాన్ని దాచుకోవడానికి ఆమె చెయ్యని ప్రయత్నం లేదు. ఆ రాత్రికి అన్ని విషయాలు చెబుదామని అనుకుంటుంది.

ఇంతలో పక్కరూంలో ఏదో గాజు పగిలిన శబ్దం విన్పిస్తుంది. ఆమె అక్కడికి పరుగెడుతుంది. రక్తగాయంతో కపిల్‌ కన్పిసాడు. గాజు ఫ్లవర్‌వేజ్‌ ముక్కలు ముక్కలై గది నిండా కన్పిస్తుంది.

‘కప్పూ.. (కపిల్‌)’ అని అంటూ అతని దగ్గరకు వెళ్తుంది. ఆమెను పక్కకు తోసివేస్తాడు.

‘నా దగ్గరకు రావొద్ద్దు…’

ఆమె ఆగిపోతుంది. అతని గొంతు బాధతో గద్గదమవుతుంది.

‘నువ్వు గర్భవతివా…?’

రమ కాళ్లు చేతులు చల్లబడిపోయాయి. మొఖం నిండా చెమటలు పట్టాయి.

‘ఆ రామన్‌ అంకుల్‌ బిడ్డేనా.. బాస్టర్డ్‌’

కప్పూ గొంతు కాదని అది బక్షి గొంతని ఆమెకు అన్పించింది. మాట్లాడుతున్నది కొడుకు కాదు, భర్త అని ఆమెకు అన్పిస్తుంది. కథ ఇక్కడితో ముగుస్తుంది. ఉర్దూలో కథ పేరు మరద్‌.మగవాడు మగవాడే. అది తండ్రి కావొచ్చు. భర్త కావొచ్చు. చివరికి కొడుకు కూడా కావొచ్చు. మగవాడికి ఒక న్యాయం. ఆడవాళ్లకి మరొక న్యాయం. ఎలాంటి వాఖ్యానాలు, ఉపోద్ఘాతాలు లేకుండా కథ నడుస్తుంది. తాను గర్భవతిని అన్న విషయం కొడుక్కి ఎలా చెప్పాలో అనుకుంటే మొదలైన కథ ఈ విధంగా ముగుస్తుంది.కథలు ఎలా రాయాలి? ఎలా ముగించాలి అని ఆలోచించే రచయితలకి ఒ ఉపకరణ గుల్జార్‌ కథలు. ఉర్దూ భాషలో రాసిన గుల్జార్‌ కథలు ఇంగ్లిష్‌లో లభిస్తున్నాయి.

అస్సాం యూనివర్సిటీ కులపతిగా గుల్జార్‌ని నియమించి భారత రాష్ట్రపతి ఓ కవిని, ఓ రచయితని మరీ ముఖ్యంగా ఉర్దూ అభిమానిని గౌరవించారు.