గుస్సాడి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎంపీ గెడం నగేష్.

నెరడిగొండఅక్టోబర్22(జనంసాక్షి): మండలంలోని యాపల్ గూడ నాగమల్యాల్ లఖంపూర్ గుత్పల అరెపల్లి తోపాటు ఆయా గ్రామాల్లో గుస్సాడీ దండారి ఉత్సవాల సందడి నెలకొంది.వివిధ వేషధారణలతో సంస్కృతి ఉట్టిపడేలా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా శనివారం రోజున దండారి ఉత్సవాలలో అదిలాబాద్ జిల్లా మాజీ ఎంపి గెడం నగేష్ నెరడిగొండ మండల పార్టీ సీనియర్ నాయకుడు గాదె శంకర్ తోపాటు పార్టీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎంపి నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుస్సాడీ దండారి ఉత్సవాలకు నిధులు కేటాయించడం హర్షనీయమని అన్నారు.ఆదివాసీల పలు ఉత్సవాలకు నిధులు ఇచ్చి ఆదివాసులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తెలంగాణ ప్రభుత్వం అందించిన గుస్సాడీ బృందానికి పదివేల రూపాయల నగదును అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు గ్రామ ఆదివాసీ దేవారీలు పెట్టెన్లు గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేశారు.