గెలిస్తే మొదటి మంత్రి వర్గంలోనే అసైన్డ్ పట్టాలు
` ఒకే విడతలో దళితబందు
` ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఇవి
` ఆలోచించి జాగ్రత్తగా ఓటేయాలి
` దలితబంధును అడ్డుకున్న కాంగ్రెస్ దరిద్రులు
` వారు చేయని లాలూచి పనులు లేవు
` అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత నాదే
` షాద్‌నగర్ ప్రజాశీర్వాద సభలో సిఎం కెసిఆర్
` మెట్రో రైలు వస్తే సంగారెడ్డికి విూ దశనే మారిపోతది
` అందోల్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు
` సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉద్యమ ద్రోహి..
` కాంగ్రెస్ రాజ్యంల రైతులు కరెంటు బిల్లు కట్టలేకపోతే తలుపులు పీక్కపొయేటోళ్లు
` కాంగ్రెసోళ్లు గెలిస్తే ఢల్లీికి, హైదరాబాద్‌కు తిరుగుడే సరిపోతది..
` వాళ్లింకా ప్రజల మధ్యఎప్పుడుంటారు?
` ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి పీఆర్సీ,డీఏలు ఇస్తాం
` చిన్న ఉద్యోగస్తులకు కూడా 30 శాతం జీతాలు పెంచాం..
` బీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభల్లో కేసీఆర్
షాద్‌నగర్,సంగారెడ్డి,ఆంధోల్,
వచ్చే ఐదేళ్ల భవిష్యత్ ఎంతో ముఖ్యమని, అందువల్ల ఆలోచించి ప్రజలు ఓటేయాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధును ఆపించిన ఘనులు కాంగ్రెస్ వాళ్లని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే యధావిధిగా దీనిని అమలు చేస్తామని అన్నారు. అలాగే అసైన్డ్ భూములకు తొలి కేబినేట్‌లోనే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని అన్నారు. యాసంగి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధును తీసుకుంటూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండని తిరుగుతున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు సిగ్గుమానం ఏమైనా ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం షాద్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. ’కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో గెలుపు కోసం చెయ్యని లాలూచీ పనులు లేవు. ఎన్ని అడ్డమైన కుట్రలు చేయాల్నో అన్నీ చేస్తున్నరు. రైతుబంధు దుబారా అంటరు. కరెంటు వృథా అంటరు. ధరణిని తీసేస్తమంటరు. ఇసుంటి లంగ మాటలు చాలా మాట్లాడుతున్నరు. లంగ పనులు చాలా చేస్తున్నరు. ఈ యాసంగికి రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతుబంధు ఎయ్యకుంట కాంగ్రెసోళ్లు ఆపిండ్రు. రైతుబంధు ఆపాల్నని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు ఇచ్చి అడ్డంపడ్డరు. దాంతోటి నేను అడిగితే ఒకరోజులో రైతుబంధు ఎయ్యిండ్రని ఈసీ పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇయ్యంగనే వద్దువద్దని మళ్ల దరఖాస్తు ఇచ్చిండ్రు. దాంతోటి ఈసీ మళ్ల ఆపిందని సీఎం కెసిఆర్ చెప్పారు. ’కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలల్ల కూడా రైతుబంధు తీసుకునేటోళ్లు చాలా మంది ఉన్నరు. వాళ్లకు ఏమన్న సిగ్గు, మానం ఉందా..? అని నేను అడుగుతున్న. విూ ఖాతాల్లో పడాల్సిన రైతుబంధును పడకుండా అడ్డుకున్న కాంగ్రెస్ విూరెట్ల మద్దతిస్తరంటున్నా. ఇసుంటి కాంగ్రెస్‌కు మద్దితిస్తే విూ కొంప గూడా కొల్లారం కాదా..? విూకు రావాల్సిన రైతుబంధు ఆగిపోదా..? కాబట్టి ఇతర ప్రజలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు గూడా ఈ విషయంపై బాగా ఆలోచించాలె. కాంగ్రెస్ కుట్రలను గుర్తెరిగి ఎన్నికల్లో ఓడగొట్టాలె. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం మళ్ల ఎనకబడుతది. మళ్ల ఎనకటి దరిద్రపు రోజులే వస్తయ్’ అన్నారు.షాద్‌నగర్ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడి వరకు మెట్రో వస్తే విూ భూముల ధరలు మూడిరతలు పెరుగుతాయని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ వజ్రం తునక లాంటి మనిషి. ఆయన చీమకు దోమకు కూడా అన్యాయం చేసే మనిషి కాదు. ఇలాంటి ఎమ్మెల్యే చాలా తక్కువ ఉంటరు రాష్ట్రం మొత్తంలో. మొదట్నుంచి నాతో పాటు నమ్మిన బంటుగా ఉన్నారు. ఇవాళ వరకు ఎలాంటి చెడ్డ పని చేయలేదు. నా నియోజకవర్గం నాకు కావాలని తండ్లాడుతాడు. అంజయ్య లాంటి ఎమ్మెల్యే ఉంటే షాద్‌నగర్‌కు ఏదంటే అది వస్తది. విూరు సిటీ పక్కకే ఉన్నారు. మేం మెట్రో రైలు గురించి ఆలోచన చేస్తున్నాం. షాద్‌నగర్ దాకా మెట్రో రావాలని అంజయ్య యాదవ్ పట్టుబట్టారు. ఆయన పట్టుబట్టి షాద్‌నగర్ వరకు మెట్రో పెట్టించారు. షాద్‌నగర్ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత నాది. విూరు అంజయ్య యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి. ఒక మెడికల్ కాలేజీ రావాలని కోరారు. నేను తప్పకుండా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాను. పీజీ కాలేజీలు కొన్ని అడిగారు. విూకు చాలా విద్యాసంస్థలు వస్తాయి హైదరాబాద్ పక్కకే ఉంటది కాబట్టి. ఒకసారి మెట్రో వస్తుందని తెలిస్తే విూ భూముల ధరలు మూడిరతలు పెరుగుతాయి. అన్ని విద్యాసంస్థలు వస్తాయి. కాలుష్య రహిత పరిశ్రమలు కూడా తరలివస్తాయి. దండం పెట్టుకుంట వస్తాయి. షాద్‌నగర్‌కు మెట్రో వస్తుందని తెలిసిన తర్వాత దీనికి డిమాండ్ తారాజువ్వాలా లేచిపోయింది. హైదరాబాద్ సంకలో ఉన్నారు కాబట్టి.. అంజయ్య లాంటి ఎమ్మెల్యే ఉంటే ప్రజల కోసం పాటు పడే ఎమ్మెల్యే ఉంటే విూ కోరికలన్నీ నెరవేరుతాయి అని కేసీఆర్ తెలిపారు. క్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ గురించి ఆనాడు నన్ను ఎవరూ అడగలేదు. చెప్పలేదు. తెలంగాణ ఉద్యమంలో నేను కనిపెట్టిన పాయింట్. తెలంగాణలో హైయేస్ట్ పాయింట్ కొందుర్గు మండలంలోని మన లక్ష్మీదేవిపల్లి. అక్కడ రిజర్వాయర్ వస్తే నెత్తి విూద కుండలా ఉంటుంది. ఇదే కాంగ్రెస్ నాయకులు పాలమూరు ఎత్తిపోతలపై గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టేలు తీసుకొచ్చి, 196 కేసులు పెట్టారు. చాలా కాలం కొట్లాడిన తర్వాత కేసులు క్లియర్ అయ్యాయి. ఒక పంపు హౌస్ ప్రారంభించుకున్నాం. ఇక్కడ పెద్దవాగు విూద కట్టేది కాదు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్. అది రింగ్ బండ వేసుకుని కట్టుకుంటాం. అది నిమిషాల్లో అయిపోతది పెద్ద సమస్య కాదు. విూకు ఎక్కువ భూములు మునగకుండా, తక్కువ భూములు మునిగేలా ఆ రిజర్వాయర్ తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. తెలంగాణ ఇరిగేషన్‌లో అది నా ప్లాన్. అది ఎన్నటికైనా రావాల్సిందే. ఒక పూట వెనుక ముందు. ఈసారి మనమే గెలుస్తున్నాం. ఈసారి తప్పకుండా ఆ పనులు స్టార్ట్ చేయిస్తానని మనవి చేస్తున్నా. ఉద్ధండపూర్ నుంచి కూడా విూకు నీళ్లు వస్తాయి. సాగు నీళ్ల బాధ కూడా తప్పుతది అని కేసీఆర్ తెలిపారు. అనేక రకాలుగా షాద్‌నగర్ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. అదే కాంగ్రెస్ చేతిలో పెడితే ఆగమై పోయే అవకాశం ఉంటుంది. అంజయ్య యాదవ్ అజాత శత్రువు. ఈగకు, దోమకు కూడా అన్యాయం చేసే మనిషి కాదు. ప్రజల కోసం పని చేస్తడు. ఇక్కడే ఉంటడు. ప్రజల మధ్యనే ఉంటడు. ఇటువంటి మంచి మనిషిని గ్యారెంటీగా కాపాడుకోవాలి. ఇక్కడ అభివృద్ధి బాధ్యత వందకు వంద శాతం నాది. నూటికి నూరు శాతం బీఆర్‌ఎస్ గవర్నమెంటే వస్తుంది. అందులో అనుమానం అవసరం లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా
సంగారెడ్డి : ఇండియా మొత్తంలో అత్యధిక శాలరీలు పొందుతున్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్ననే పీఆర్పీ అపాయింట్ చేశాం. మళ్ల మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా బ్రహ్మాండంగా ఇచ్చుకుందామని కేసీఆర్ తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఈ రాష్ట్రంలో పేదలను, రైతులను, ప్రభుత్వ ఉద్యోగలను అందర్నీ సమదృష్టితో చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పాను ప్రభుత్వ ఉద్యోగస్తులకు, తెలంగాణ ధనిక రాష్ట్రం అయితది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా విూకు శాలరీలు వస్తాయని చెప్పాను. నేను రుజువు చేసి చూపెట్టాను. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. ఇండియా మొత్తంలో ఉద్యోగస్తులకు హైయేస్ట్ శాలరీ ఇచ్చేది ఏదన్న ఉందంటే అది తెలంగాణ స్టేట్ మాత్రమే. మళ్ల మొన్న కూడా పీఆర్సీ అపాయింట్ చేశాం. మళ్ల కూడా మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం. బ్రహ్మాడంగా డీఏలు కూడా ఇచ్చుకుందాం అని కేసీఆర్ తెలిపారు.వాటితో పాటు ఉద్యోగల సంక్షేమాన్ని చూశాం. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు కొంత మంది ఉన్నారు. చాలా మందిని రెగ్యులరైజ్ చేశాం. వాళ్లు పోను మిగతా ఎవరైతే ఉన్నారో పీఆర్సీ ఉద్యోగులకు 30 శాతం ఇస్తే, ఆ చిన్న ఉద్యోగుల కడుపు నింపాలని వాళ్లకు కూడా 30 శాతం జీతాలు పెంచినం. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు. ఎక్కడ జరగదు. ఆర్టీసీ ఉద్యోగులు మా ఉద్యోగాలు పోతాయని దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు ఉండేవారు. వాళ్లు ఫైట్ చేశారు. మొన్ననే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. గవర్నర్ లేట్ చేయడం వల్ల ఆలస్యమైంది. గవర్నమెంట్ వచ్చిన తెల్లారి.. నెలలోపు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తాం. ఇలా అందర్నీ సమదృష్టితో సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కులం, మతం అనే తేడా లేకుండా ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెసోళ్లు గెలిస్తే ఢల్లీికి, హైదరాబాద్‌కు తిరుగుడే సరిపోతది.. ప్రజల మధ్య ఉంటరా..?: సీఎం కేసీఆర్
ఆంధోల్: కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్నదని, కాబట్టి 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్‌ఎస్ పార్టీని, ఆంధోల్‌లో క్రాంతి కిరణ్‌ను గెలిపించాలని సీఎం కోరారు. క్రాంతి కిరణ్‌ను గెలిపించి ఆయన చేతుల విూరు కత్తి పెట్టాల్నని, కత్తి ఒకలికి ఇచ్చి, యుద్ధం ఒకల్ని చేయమంటే అయితదా..? అని ఓటర్లను ప్రశ్నించారు. క్రాంతి కిరణ్‌ను గెలిపిస్తే ఆంధోల్ మరింత అభివృద్ధి చెందుతదని అన్నారు. ఆంధోల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.‘బీఆర్‌ఎస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతోటి వ్యవసాయం బాగుపడ్డది. ఇయ్యాలా రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వడ్లు పండుతున్నయ్. కాంగ్రెస్ హయాంల ఉత్త కోతలే ఉండేటియి.. ఇప్పుడు బీఆర్‌ఎస్ పాలనలో వరి కోతలు ఉంటున్నయ్. కాంగ్రెసోళ్లు ధరణిని తీస్కపోయి బంగాళాఖాతంలో వేస్తమని అంటున్నరు. అంటే ఏమన్నట్టు..? ధరణిని తీసేసి మళ్ల ఎనకటి దళారీ రాజ్యం తెస్తరన్నట్టు. రైతులు దళారీల చుట్టు తిరిగి, లంచాలు పోసే పరిస్థితి తీసుకొస్తరన్నట్టు. కాబట్టి పొరపాటున కూడా కాంగ్రెస్‌ను గెలువనీయవద్దు. కాంగ్రెస్ గెలిస్తే అంతా బూడిదల పోసిన పన్నీరు అయితది’ అని హెచ్చరించారు.‘సింగూరు జలాశయం మన నెత్తివిూద కుండలా ఉంటది. నాకు జోగిపేట బాగా తెలుసు. ఇక్కడ నేను తిరగని గల్లీ లేదు. జోగిపేట పట్టణంలో మాణిక్‌రెడ్డి సాబ్ ఇంట్లో పండుకుని ప్రతి గల్లీ తిరిగిన నేను మినిస్టర్‌గా ఉన్నప్పుడు. సమస్యలన్నీ చూసి చేయాల్సినవన్నీ చేసిన. సింగూరు నీళ్లు ఆనాడు ఎందుకు రాలే?? ఎందుకు కాంగ్రెసోళ్ల నోర్లు బంద్ అయినయ్..? సమైక్య పాలకులు మన నోర్లుగొట్టి, ఇటు మనల ముంచి, అటు ఘనపూర్ ఆయకట్టును ముంచి, నిజాంసాగర్ ఆయకట్టును ముంచి, సింగూరును హైదరాబాద్‌కు అప్పజెప్పి మంచి నీళ్లు అని పెడితే ఒక్క కాంగ్రెసోడు నోరు తెర్సిండా..? ఇక్కడ నిలబడ్డ దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టలేదా..? మరె ఏం జేసిండు..? ఎందుకు తేలేదు నీళ్లు..?’ అని సీఎం ప్రశ్నించారు.‘సమైక్య రాష్ట్రంల చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అని ఒకాయన ఉండె. మనోళ్లు హరీశ్‌రావుగిట్ల తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి అసెంబ్లీల కొట్లాడుతున్నరు. అప్పుడు ఆయన ఏమన్నడు..? తెలంగాణకు ఒక్క రూపాయి గూడా ఇయ్య.. ఏం జేసుకుంటరో చేస్కోపోండ్రి అన్నడు. ఒక్క కాంగ్రెసోడన్నా మాట్లాడిరడా..? ఇదే దామోదర రాజనర్సింహ మంత్రి పదవి వెలగబెట్టుకుంట ముసిముసి నవ్వులు నవ్వుకుంట ఆసెంబ్లీల కూసున్నడు. మరి ఇయ్యాల ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతుండు..? కాంగ్రెసోళ్లు పైనంగనేమో రైతుబంధు దుబారా, 24 గంటల కరెంటు వృథా, ధరిణి తీసేస్తం అని మాట్లాడుతున్నరు. ఇక్కడ రాజనర్సింహనేమో నాకు ఓటేసి గెలిపించండి అని అడుతున్నడు. రేపు కాంగ్రెస్ గెలిచి మూడు గంటల కరెంటు చేస్తే ఏం జేస్తడు..? అది పైనోళ్లు జేసిన పని నా చేతుల లేదు అంటడు. అయినా కాంగ్రెసోళ్లు గెలిస్తే ఢల్లీికి, హైదరాబాద్‌కు తిరుగుడే సరిపోతది. ఈడ ఉంటరా..? క్రాంతి కిరణ్ లోకల్ వ్యక్తి కాబట్టి విూ మధ్యలనే తిరుగుతున్నడు. కాంగ్రెసోడు గెలిస్తే ఈ పరిస్థితి ఉంటదా..? కాబట్టి విూరు ఒట్టిగ ఓటెయ్యొద్దు. జాగ్రత్తగా ఓటేస్తే మంచిగ పని చేసే నాయకులు, ప్రభుత్వం ఉంటయ్’ అన్నారు.‘సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల గానీ.. సింగూరుకు కాళేశ్వరం లింకు గానీ.. వీటి ద్వారా జోగిపేట నియోజకవర్గంలో ఒక లక్షా 70 వేల ఎకరాలకు నీటి పారుదల వస్తది. జోగిపేట సుభిక్షంగా, బ్రహ్మాండంగా ఉంటది. కాబట్టి ఇక్కడ క్రాంతి కిరణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుతున్నా. క్రాంతి కిరణ్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని కోరికలు కోరిండు. అవన్నీ నెరవేరుస్తా అని మాట ఇస్తున్నా. కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యంలనే గదా తెలంగాణ నాశనం పట్టంది. ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే.. ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకం ఎందుకు తెచ్చినట్టు..? ఇందిరమ్మ రాజ్యం సక్కగ లేకనేగదా ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకం తెచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలనే గదా తెలంగాణ కోసం కొట్లాడిన 400 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది’ అని సీఎం విమర్శించారు.
సంగారెడ్డికి మెట్రో రైలు వస్తే.. విూ దశనే మారిపోతది
సంగారెడ్డి : సంగారెడ్డి వరకు మెట్రో రైలు వస్తే విూ దశనే మారిపోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందన్నారు కేసీఆర్. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.సంగారెడ్డి పట్టణం హైదరాబాద్‌లో అంతర్భాగం అయితా ఉన్నది. మెట్రో రావాల్సిన అవసరం ఉంటది. ఇస్నాపూర్ వరకు మొదటి దశలో, రెండో దశలో సంగారెడ్డి వరకు తీసుకురావాలని చింతా ప్రభాకర్ చెప్పారు. సంగారెడ్డికి మెట్రో వచ్చిదంటే విూ దశనే మారిపోతది. లాస్ట్ టైం బీఆర్‌ఎస్ క్యాండిడేట్‌ను ఓడగొట్టినా.. సంగారెడ్డి విూద నేను అలగలేదు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ తెచ్చిపెట్టాను. చింతా ప్రభాకర్ నా వెంబడి పడి ఇక్కడకు మెడికల్ కాలేజీ వచ్చేలా చేశారు. దాంతో పాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు వస్తున్నాయి. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటది అని కేసీఆర్ పేర్కొన్నారు.ఇక్కడ మంచిగా పని చేసే ఎమ్మెల్యే ఉంటే, హైదరాబాద్ సంకలోకి వచ్చింది సంగారెడ్డి కాబట్టి కాలుష్య రహితమైన పరిశ్రమలు, విద్యాసంస్థలు వచ్చే అవకాశం ఉంటది. ఇప్పటికే కొన్ని వచ్చాయి. ఇంకా బ్రహ్మాండంగా వస్తాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఉండి ఇక్కడకు వచ్చిపోయేది ఉద్యోగులు. ఇప్పుడు సంగారెడ్డిలో ఉండి హైదరాబాద్‌కు పోయి వస్తున్నరు. ఆ మార్పు వచ్చింది. సంగారెడ్డి బాగా పెరిగింది కాబట్టి ఆ మార్పు వచ్చింది. నేను పాత మెదక్ జిల్లా విూ బిడ్డను. ఢల్లీికి రాజైనా తల్లికి కొడుకే అని పెద్దలు చెప్పారు. జన్మభూమి విూద ఎవరికైనా సరే, ఎక్కడున్న ప్రేమ ఉంటది. అందుకే సంగారెడ్డితో నాకు అనుబంధం ఉంది. ఈసారి దయచేసి మళ్ల నేను అలిగేటట్టు చేయకండి ప్రభాకర్‌ను గెలిపించండి లాభం జరుగుతది అని కేసీఆర్ చెప్పారు.