గొప్ప చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

 

పినపాక నియోజకవర్గం ఆగష్టు 18 (జనం సాక్షి): భూస్వాములు చేసే దురాగతాలను అంతమొందించడానికి గోల్కొండ కోట పై బడుగు బలహీన జెండా ఎగురవేసిన గొప్ప చక్రవర్తి పాపన్న గౌడ్ అని కొనియాడారు. మణుగూరు మండలం తిర్లపురం గ్రామం లో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికారి బహుజన హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు స్వరాష్ట్రంలో సగర్వంగా అధికారకంగా నిర్వహించుకోవడం రాష్ట్రంలో బహుజనులందరికీ దక్కినా గౌరవం అని అన్నారు.బడుగు బలహీనర్గాలకు ఆయన చేసిన సేవా మర్వలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.