గోదారి వరద ముంపు బాధితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని సమావేశం నిర్వహించిన: సిపిఐ.

బూర్గంపహాడ్ ఆగష్టు30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక సిపిఐ ఆఫీస్ లో పోలవరం ముంపు మండల ప్రజలను కాపాడాలని అఖిలపక్ష సమావేశం సిపిఐ మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల బూర్గంపహాడ్ పూర్తిగా నీట మునుకుతుందని వారికి పోలవరం నిర్వాసితుల కింద మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని అలాగే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కంటే నాలుగు రెట్లు భూములకు నష్టపరిహారం ఇవ్వాలని, సారపాక లో ఉన్న ఐటీసీ పిఎస్పీడీని దానిపై ఆధారపడే ప్రత్యక్ష పరోక్షంగా ఉన్న ప్రజలను కాపాడడం కోసం మోతే నుండి కరకట్ట నిర్మాణం చేపట్టాలని ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు తీర్మానం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నుండి పొలిటికల్ జేసిని ఏర్పాటు చేసుకున్నారని ఈ సమావేశంలో టిడిపి, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాలు కుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు.