గోదావరికి పెరిగిన వరద
నిండుకుండలా ఎల్లంపల్లి రిజర్వాయర్
కరీంనగర్,ఆగస్టు13(జనం సాక్షి): ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరి బేసిన్‌లోని జలాశయాలకు నీరు చేరుతోంది.వరద పోటెత్తడంతో పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఎగువున ఉన్న మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లికి భారీఎత్తున వరద వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా వరద రావడంతో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులాలని నిర్ణయించారు. వరద ఉధృతి అంతకంతకూ పెరుగడంతో గోదావరిలోకి విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు ఇంతమొత్తంలో వరదనీరు రావడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి ఆదివారం రాత్రి భారీస్థాయిలో వరద చేరడంతో అధికారులు ప్రాజెక్టు వరదగేట్లు ఎత్తి 2.89 లక్ష ల క్యూసెక్కుల జలాలను దిగువకు వదిలారు. అయితే, ఈ ప్రాజెక్టుకు కొన్ని గంటల్లోనే వరద తగ్గుముఖం పట్టింది. శ్రీ రాంసాగర్‌కు స్వల్పంగా ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి. కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రంభీం ప్రాజెక్టు 5 గేట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని 6 గేట్లు, తాలిపేరు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. పెరూరు విూదుగా 7.80 విూటర్ల ఎత్తులో 2.50 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు ప్రవహించాయి.