గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆవుపేడ వినాయక విగ్రహాల పంపిణీ …

డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 26 (జనంసాక్షి):
తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ ఆదేశానుసారం ఆవుపేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలు శివపార్వతి గోశాల ఫెడరేషన్ నర్సింహులపేటలో ఆధ్వర్యంలో గోశాల కార్యదర్శి సుధాకర్ నాయక్ స్థానిక పోలీసు స్టేషన్ లో, పలు ఆలయాల్లోని పూజారులకు, పలువురు రైతులకు, దుకాణదారులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సింహులపేట ఎస్సై మంగీలాల్ మాట్లాడుతూ ఆవుపేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలతో కాలుష్యాన్ని నివారించవచ్చు. కాలుష్య రహిత విగ్రహాలను పూజించడంతోనే ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. శివపార్వతి గోశాల కార్యదర్శి సుధాకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఆవుపేడతో రాఖీలు, దీపావళి ప్రమిదలు, అగర్ వత్తులు, ప్రస్తుతం వినాయక విగ్రహాలు ఉత్పత్తుల తో పాటు గోమయంతో పలు రకాల వస్తువులను తయారు చేస్తూ ప్రజలకు ఉపయోగంలోకి తీసుకవస్తున్నట్లు ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ సంతోష్, కానిస్టేబుల్ లు యాకన్న, శ్రీను, పలు ఆలయాల అర్చకులు. పలువురు రైతులు పాల్గొన్నారు.