గ్రామజ్యోతితో పల్లెవెలుగు
– అభివృద్ధి ప్రణాళికలే ఆధారం
– విమర్శలకు భయపడొద్దు
– ముందుకు సాగండి
– గ్రామజ్యోతి సమీక్షలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం
హైదరాబాద్,ఆగస్టు 11(జనంసాక్షి):
గ్రామజ్యోతి పథకంతో తెలంగాణ పల్లెలు వెలిగిపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. సర్పంచ్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికై ప్లానింగ్ జరగాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని తసీఉకుని వస్తున్నామని స్పష్టం చేశారు. ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రణాళిక రచించాలని, అందులో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఇంతకాలం కుంటుపడిన గ్రావిూణాభివృద్ధి పరుగెత్తాలని అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సిఎం కెసిఆర్ మంగళవారం సవిూక్షించారు. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం ప్రారంభోపన్యాసం చేశారు. గ్రామాల అభివృద్దికి స్బంధించి ప్రణాళిక ద్వారా ముందుకు సాగాలన్నదే పథకం లక్ష్యమన్నారు. గ్రామాలు అభివృద్ది చెందితే ఆటోమేటిక్‌గా రాష్ట్రం అభివృద్ది చెందగలదన్నారు. ఊళ్లల్లో చెత్త లేకుండా చేయడం మొదలు, గ్రామాల కనీస వసతులు మెరుగు పర్చుకోవడం దీని ప్రధానోద్దేశ్యమని సిఎం వివరించారు. దీనిని చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనన్నారు. తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమం చేపట్టి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకుని వచ్చాన్నారు. దళితులు ఉన్నతంగా ఎదగాలన్నదే తన ఆకాంక్షని అంటూ, గ్రామాల్లో ప్రతి చిన్నదీ రాజకీయం చేయడానికి రాజీకయా పార్టీలు సిద్దంగా ఉంటాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలన్నారు. చిన్నముల్కనూరు గ్రామాన్ని తానే దత్తత తీసుకున్నానని తెలిపారు. అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామంటే చిన్నముల్కనూరు గ్రామస్తులు అద్భుతంగా స్పందించారని చెప్పారు. అంకాపూర్, గంగాదేవిపల్లి, ముల్కనూరు గ్రామాలను ఇతర గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రైతాంగం సంఘటిత శక్తికి అంకాపూర్ గొప్ప ఉదాహరణ అని చెప్పారు.గంగదేవిపల్లిలో 25 రకాల కమిటీలు 25 రకాల విధులను నిర్వర్తిస్తున్నాయి. ఆ విధంగా ప్రతి గ్రామ ప్రజలు ముందుకు పోయినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. చెడుకు వ్యాప్తి ఎక్కువ.. మంచికి అంత త్వరగా గుర్తింపు రాదు అని సీఎం అన్నారు. గ్రామజ్యోతి ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. సర్పంచి స్థాయి నుంచి అందరూ సంఘటితం కావాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోందన్నారు. గ్రామజ్యోతిలో నాయకులు ప్రజలను చైతన్య పరచాలని కోరారు. సమస్యలుంటాయి… సహనంతో ధైర్యంగా పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. గ్రామజ్యోతి ఓ అద్భుతమైన కార్యక్రమం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామజ్యోతిలో భాగంగా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టే చేస్తే తెలంగాణ అద్భుతంగా తయారవుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న 750 మందికి ఒక చెత్త రిక్షా పంపిణీ చేస్తామన్నారు. ప్రతీ గ్రామానికి ఒక డంప్‌యార్డ్, శ్మశానవాటిక ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డంప్‌యార్డుల కోసం రూ. 20 కోట్ల నుంచి 20 కోట్ల నిధులతో ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తాం. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు 25000 రిక్షాలు ఇస్తాం. గ్రామాల్లో ఒక రోజు పవర్ హాలిడే
ప్రకటించాలని సూచించారు. గ్రామజ్యోతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం పాల్గొనాలని ఆదేశించారు. గ్రామసభలో గ్రామస్తులే గ్రామ ప్రాధాన్యతను గుర్తించాలని చెప్పారు. మనకు శక్తివంతమైన మహిళా సంఘాలున్నాయి. అందరి సమిష్టి కృషితో తెలంగాణను అద్భుతంగా తయారు చేయొచ్చు అని తెలిపారు.గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో వెలుతురు వచ్చేలా గ్రామజ్యోతిని వెలిగిద్దామని చెప్పారు. అన్ని గ్రామాలకు సంబంధించి నాలుగేళ్ల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. గ్రామాల్లో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. ఆ క్రమంలో గ్రామంలోని సమస్యలను గుర్తించాలన్నారు. అతీత శక్తులను పట్టించుకోకుండా ముందుకుపోవాలని సూచించారు. మండలానికి ఒక ఊరిని ఎమ్మెల్యే దత్తత తీసుకోవాలన్నారు. తాను కూడా అన్ని జిల్లాల్లో తిరిగి ప్రజలతో మమేకవుతామని తెలిపారు. విమర్శలకు వెరిస్తే ముందుకు సాగలేదమన్నారు. రాజకీయాలలో తాను పడినన్ని కష్టాలు మరెవరు పడి ఉండరని కెసిఆర్ అన్నారు. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమం ఆరంభించిన 2001 నుంచి ఎన్ని అవాంతరాలు, అపవాదులు,ఎన్ని గందరగోళాలు జరిగాయో తెలుసని, అయినా ఒక స్థిరమైన నిర్ణయం , ఆలోచన ద్వారా లక్ష్య సాధనలో ముందుకు సాగామని ఆయన అన్నారు. అలాగే తెలంగాణలో ఏ అభివృద్ది అయినా ప్రణాళికబద్దంగా సాగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.అన్ని రకాల నిధులు కలిసి గ్రామాలలో పాతికవేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని కెసిఆర్ చెప్పారు.గ్రామంలో ఉండవలసిన అవసరాలపై పంచాయతీలు ప్లాన్ చేసుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.