గ్రామాలు పిడికిలి బిగిస్తేనే అభివృద్ధి
– గంగాదేవిపల్లి రాష్ట్రానికే ఆదర్శం
– ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం
– రూ.10 కోట్ల రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు
– గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్
వరంగల్, ఆగస్ట్17(జనంసాక్షి):
గ్రామాలు పిడికిలి బిగిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రతి గ్రామ ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని, గ్రామజ్యోతికి గంగదేవిపల్లి ఆదర్శమని, ఎవరి గ్రామాన్ని వారు అభివృద్ది చేసుకుంటే బంగారు తెలంగాణ సాధ్యమని సిఎం కెసిఆర్ అన్నారు. స్వయం సమృద్ది సాధించిన గంగదేవిపల్లి మరింతగా పురోగమించడానికి తక్షణంగా పదికోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. గంగదేవిపల్లి అభివృద్దికి సంబంధించిన ప్రణాళికను వారే తయారు చేసుకుని తాను మంజూరుచేసిన నిధులను వినియోగించుకోవాలన్నారు. ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాలను కూడా మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. అయితే మరింతగా అభివృద్ది చెందేలా ప్రణాళికుల తయారు చేసుకోవాలని, నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌ను సందర్శించి వ్యవసాయ మెళకువలు తెలుసుకోవాలన్నారు. అలాగే హదారాబాద్ శివారులోని ప్రతగి రిసార్టును సందర్శించి దోమల నివారణకు వారుపెంచుతున్న మొక్కలను తెలుసుకోవాలన్నారు. గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించేందుకు గాను గంగదేవిపల్లికి చేరుకున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు గ్రామంలో ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ భవనాన్ని సందర్శించారు. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. సర్పంచ్‌ను, వార్డు మెంబర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గంగదేవిపల్లిలో ఆయన గ్రామస్థుల కరతాల ధ్వనుల మధ్య గ్రామజ్యోతి పథకాన్ని జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.ఈ గ్రామ పురోభివృద్దిని తెలుసుకునే ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. పట్టుబట్టి సాధిస్తే ఏదీ సాధ్యం కాదని తెలంగాణ విషయంలో రుజువు చేసుకున్నామని అన్నారు. మన బతుకులను మనం బాగు చేసుకుందామని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. పట్టుబడితే గ్రామాలు కూడా బాగుపడతాయన్నారు. వ్యక్తులుగా మనం పటిస్టంగా ఉన్నా సంఘటితంగా పనులు చేయలేకపోతున్నామని అన్నారు. సంఘటిత శక్తిని చాటితే గ్రామాల్లో దరిద్రం పారిపోతుందన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకుందామని అన్నారు. గంగదేవిపల్లి ఆదర్శ గ్రామాలకు చక్కటి ఉదాహరణ అని తెలిపారు. ఈ ఊరి ప్రజలు కొన్ని నియమాలు పెట్టుకుని వాటికి కట్టుబడి ఉన్నారని అన్నారు. పరిశుభ్రంగా ఉండటం, పద్ధతిగా జీవించడం చాలా గొప్ప విషయమన్నారు. గంగదేవిపల్లి ప్రజలకు స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ ఊరి ప్రజలే తనను ఇక్కడకు రప్పించాయని తెలిపారు.విూ ఊరికి అవార్డులు కూడా వచ్చాయని గుర్తు చేశారు. మాజీ సర్పంచి రాజమౌళిని ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఉపన్యాసం ఇప్పించామని, ఆయన తన హయాంలో చేసిన పనుల అనుభవాలను వివరించారని పేర్కొన్నారు. గొప్ప సంస్కారం గ్రామంలో గ్రామస్థులో ఉందని కొనియాడారు. ఎలాంటి వివాదం లేకుండా సరియైన వేదికను ఏర్పాటు చేశారని కితాబిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన సభాపతి మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ వినోద్,ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ సభకు భారీ సంఖ్యలో ప్రజలు, డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. అంతకు ముందు గ్రామస్థులు సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు.
చేయిచేయి కలిపితే గ్రామాభివృద్ది సాధ్యం
హన్మకొండ ఆగస్ట్17(జనంసాక్షి):
మన గ్రామాల్లో జ్యోతులు వెలగాలంటే గ్రామాలు అభివృద్ది చెందాల్సిందేనని అన్నారు. మనగ్రామాన్ని మనమే అభివృద్ది చేసుకోవాలని, ఎవరో వచ్చి అభివృద్ది చేయరని సిఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గ్రామాల్లో జ్యోతి వెలిగితేనే మనం బాగుపడతామని పేర్కొన్నారు. జిల్లాలోని మేడిపల్లిలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ.. మన పల్లెను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన
మనలో రావాలన్నారు. మనం మేల్కొంటేనే బాగుపడతామని తెలిపారు. రాంపల్లి, మేడిపల్లి గ్రామాల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. వీటితో ఏమేం అభివృద్ధి పనులు చేసుకోవాలో గ్రామ కమిటీలు నిర్ణయించుకోవాలన్నారు. చేయిచేయి కలిపితే గ్రామాలు అభివృద్ది చెందడమే గాకుండా పారిశుద్యం పారదోలవచ్చన్నారు. దీనికోసం సిఎం,మంత్రులు రావాలా అని ప్రశ్నించారు. గ్రామాభివృధ్ది కోసం యువకులు ముఖ్యంగా మహిళలు నడుం బిగించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామానికి రూ.కోటి విరాళం ఇచ్చిన యశోద ఆస్పత్రి అధినేత గోరుగంటి సురేందర్‌రావు బ్రదర్స్‌ను సీఎం కేసీఆర్ వేదికపైనే సన్మానించారు.
కరీంనగర్ జిల్లాలోని ముల్కనూరు, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్, వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి దేశానికే ఆదర్శమన్నారు. గంగదేవిపల్లిలో కమిటీల ద్వారా అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. కాకతీయ రెడ్డి రాజుల పుణ్యమా అని జిల్లాలో మంచి చెరువులున్నాయని తెలిపారు. వాటితో విూరు మంచి పంటలు పండిస్తారని పేర్కొన్నారు. కానీ ఏదైనా పద్ధతి ప్రకారం చేస్తేనే విజయం సాధిస్తామని తెలిపారు. ప్రణాళికాబద్దంగా వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. గంగదేవిపల్లి గ్రామస్తులకు ఎవరూ చెప్పలేదని వారంతట వారే అభివృద్ది సాధించారని వివరించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ ఉండదని, కొరత తప్పదని కొందరు అపోహలు సృష్టించారని వాటిని పటాంపంచలు చేస్తూ ఇవాళ మనం విద్యుత్ కొరతలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దుకున్నామని వివరించారు. వచ్చే మార్చి తర్వాత వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేస్తామని అన్నారు. రెండు సంవత్సరాల్లో వరంగల్ జిల్లా జలకళతో పులకరిస్తుందని అందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్ రాష్ట్రంగా ఉందని వెల్లడించారు. ప్రజలకు సాగు, తాగు నీరందించే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని ,. గుడుంబా మహమ్మారి మనల్ని వేధిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎని సంక్షేమ పథకాలు చేపట్టినా గుడుంబా మహమ్మారి ప్రజల జీవితాల్సి ఛిద్రం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాతలకు కొదవలేదని సీఎం వ్యాఖ్యానించారు. గ్రామజ్యోతి పథకం కింద మేడిపల్లి గ్రామాభివృద్ధి కోసం రూ.కోటి విరాళం ప్రకటించిన యశోద ఆస్పత్రి అధినేత గోరుగంటి సురేందర్‌రావు బ్రదర్స్‌ను వేదికపైనే ఆయన సన్మానించారు. గ్రామాభివృద్ధి కోసం రూ.కోటి విరాళం ఇచ్చిన సురేందర్‌రావును సీఎం అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం రూ.కోటితో పాటు ఆయన నివాసాన్ని కూడా విరాళంగా ఇచ్చారని వెల్లడించారు. సురేందర్‌రావు పెద్ద ఆస్పత్రి యజమాని అయి ఉండి తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని విరాళం అందించడం అభినందనీయమన్నారు. ఎంత ధనం సంపాదించినా సొంత ఊరును మరవలేదని కితాబిచ్చారు. మన వద్ద ఐక్యత ఉందని తెలిపారు. కాగా, గ్రామాభివృద్ధి కోసం దొడ్డ మోహన్‌రావు రూ.50 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ సుధాకర్‌రావు రూ.25 లక్షలు విరాళం ఇచ్చారని తెలిపారు.