: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట- జెడ్పీ ఫ్లోర్ లీడర్ నీరటి తన్వీరాజ్.
*గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట- జెడ్పీ ఫ్లోర్ లీడర్ నీరటి తన్వీరాజ్*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : గ్రామాల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రంగారెడ్డి జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ నీరటి తన్వి రాజు అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కడలో ఆదివారం సర్పంచ్ సునిగంటి సిద్దులు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు జెడ్పీ ప్లోర్ లీడర్ నీరటీ తన్వీరాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని అనంతరం వృద్ధులకు ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో తాండాలను సైతం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతి పేరుతో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్ లు ఏర్పాటుచేసి గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ త్రాగునీటి సమస్యలను దాదాపు పూర్తి చేయడం జరిగిందని, ఇంకా మిగిలి ఉన్న పనులు అన్నిటిని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో అంచలంచలుగా పూర్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటీసి గౌతమి అశోక్,గ్రామ కార్యదర్శి లక్ష్మీనరసింహ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : నర్కడ గ్రామ సభలో మాట్లాడుతున్న జడ్పీ ఫ్లోర్ లీడర్ నీరటి తన్వీరాజ్.
Attachments area