గ్రామాల దిశ మార్చే పల్లె ప్రగతి

 

ప్రజలంతా సహకరించాలి
అధికారులు నిర్దేశిత లక్ష్యం చేరుకోవాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు
వరంగల్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): ప్రతి గ్రామాన్ని ప్రగతి దిశగా తీసుకుపోయేందుకే పల్లె ప్రగతి
కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేపట్టి విజయవంతం చేశామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమం తొలిదశతో గ్రామాల రూపురేఖలు మారాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సమస్యలకు పరిష్కారం చూపబోతున్నామని అన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు,ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సూచించారు. ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకుపోయామని అన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రతినెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. పల్లె ప్రగతిలో యువకులు, మహిళలు, పెన్షనర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అలాగే, పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరి గ్రామాలను వారు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు స్ఫూర్తి తీసుకుని రావాలన్నారు. గ్రామాలలో నర్సరీల పెంపకం, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులకు స్థలాల సేకరణ, మొక్కల సంరక్షణ, శిథిలావస్థలో ఉన్న భవనాల భవనాల తొలగింపు, పాత బావుల పూడికతీత, తడి`పొడి చెత్త సేకరణకు చెత్తబుట్టల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్లలె ప్రగతి పనుల పరిశీలన కోసం ప్లెయింగ్‌ స్కా డ్‌ అధికారులను నియమించాలని సూచించారు. వారు ప్రతి మండలంలోని రెండు
గ్రామ పంచాయతీలలో జరిగే పనుల పురోగతి , నాణ్యత కార్యక్రమాలను పరిశీలిస్తారని తెలిపారు. ఆయా మండలాల్లో ప్లలె ప్రగతి కార్యక్రమాల అమలు, గ్రామాలకు చేకూరిన లబ్దిని అంచనా వేసి పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించే మొబైల్‌ యాప్‌లలో డాటాను నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామానికి సంబంధించిన వార్షిక ప్రణాళికతోపాటు ఐదేండ్ల ప్రణాళికను రూపొందించాలని తెలిపారు.