గ్రామ స్థాయి నుంచి కాపు సంఘాన్ని పటిష్టం చేస్తాం

శివ్వంపేట అక్టోబర్ 8 జనంసాక్షి : గ్రామస్థాయి నుంచి మున్నూరు కాపు సంఘాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర  అధ్యక్షుడు కొండ దేవయ్య పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి మొదటి ప్లీనరీ సమావేశం వరంగల్ లోని మాతా గార్డెన్ లో జరిగింది. ఈ ప్లీనరీ సమావేశానికి మెదక్ జిల్లా నుంచి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బట్టి జగపతి, కల్లూరి హన్మంతరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేమె యాదగిరి, మెదక్ కోఆర్డినేటర్ వీర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య జిల్లాలో మున్నూరు కాపుల బలోపేతంతోపాటు గ్రామ స్థాయిలో సంఘ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి విష్ణు జగతి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ తోపాటు 33 జిల్లాల అధ్యక్షులు, మండల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.