గ్రావిటి కెనాల్ లైనింగ్ పనులు జూన్ చివరినాటికి పూర్తి చేయాలి
– 7వ ప్యాకేజీలోని టెన్నెల్ లైనింగ్ పనుల పరోగతిపై మంత్రి అసంతృప్తి
– పనులు వేగవంతం చేయాలి
– అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్‌రావు
– కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి
కాళేశ్వరం, మే3(జనం సాక్షి) : కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ పనులను భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గురువారం పరిశీలించారు. ఇప్పటికే కాలువ లైనింగ్ పనులు మూడున్నర కిలోవిూటర్లు పూర్తి అయ్యాయి. మిగతా పనులు జూన్ 15 కల్లా పూర్తి చేస్తామని అధికారులు మంత్రి హరీష్‌రావుకు వివరించారు. అయితే గ్రావిటీ కెనాల్ లైనింగ్ ఇంకా 44 శాతం పూర్తి కావాల్సి ఉందని.. ఈ పనులను జులై చివరి కల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రావిటీ కాలువపై 10 స్టక్చ్రర్లు ఉన్నాయి. ఇందులో ఒక్కటి కూడా పూర్తి కాలేదని , వీటిని కూడా జూన్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక 7వ ప్యాకేజీలోని టన్నెల్ లైనింగ్ పనుల పురోగతిపై హరీష్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. జులై చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో లైనింగ్ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. 5.75 కి విూ కాలువ తవ్వకం పూర్తి అయ్యిందని, ఈ కాలువపై ఉన్న 10 స్టక్చ్రర్లు చివరి దశలో ఉన్నాయి. జూన్ 15 కల్లా ఈ పనులు పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి సూచించారు. కాలువ లైనింగ్ 3.5 కి విూ పూర్తి అయిందని, మిగతా లైనింగ్ పనులు జూన్ 15 కల్లా పూర్తి చేస్తామని ఇంజనీర్లు మంత్రికి వివరించారు. ప్యాకేజీ 7 టన్నెల్ లైనింగ్ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి. జూలై చివరినాటికి ఎత్తి పరిస్థితుల్లో లైనింగ్ పనులు పూర్తి కావాలని ఆదేశించిన మంత్రి ప్యాకేజీ 8 లో ఇంకా 20శాతం బెడ్ కాంక్రీట్ లైనింగ్ పూర్తి కావాల్సి ఉన్నదని, గ్రావిటీ కెనాల్ లైనింగ్ ఇంకా44శాతం పూర్తి కావాల్సి ఉన్నదని, ఈ పనులని జూలై చివరి కల్లా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. టన్నెల్ లైనింగ్ పనుల్లో రోజుకు కనీసం 4 గ్యాంటీకు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి ఏజెన్సీలకు సూచించారు.