గ్రేట్‌ వాల్‌ను సందర్శించిన సీఎం బృందం

షెంజాన్‌కు చేరుకున్న కేసీఆర్‌

C

బీజింగ్‌ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):

చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం బీజింగ్‌ పర్యటన ముగించుకుని షెన్‌ జెన్‌ సిటీకి బయల్దేరారు. కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఏడో రోజు చైనా పర్యటనలో వ్యాపార ప్రముఖులతో సమావేశమైంది.బీజింగ్‌ పర్యటనలో భాగంగా శనివారం పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన కేసీఆర్‌ బృందం.. ఈరోజు కూడా మరికొంతమంది పారిశ్రామికవేత్తలో భేటీ అయ్యింది.బీజింగ్‌ పర్యటనను ముగించుకున్న అనంతరం కేసీఆర్‌ బృందం నేరుగా షెన్‌ జెన్‌ సిటీకి పయనమైంది.శనివారం బీజింగ్‌లోని రాఫెల్స్‌ బీజింగ్‌ ¬టల్‌లో ఇన్‌స్పూర్‌ గ్రూపు, చాంగ్‌ క్వింగ్‌, చైనా ఫార్చ్యూన్‌ సంస్థలతోపాటు చైనా రైల్వే కార్పొరేషన్‌ (సీఆర్‌సీ), సానీ గ్రూపు ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించింది. రాష్ట్రంలో నూతన పారిశ్రామికవాడల నిర్మాణంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చలు జరిగాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల రంగంలో చైనాలో అగ్రగామిగా ఉన్న ఇన్‌స్పూర్‌ గ్రూపు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి ప్రదర్శించింది. చాంగ్‌ క్వింగ్‌ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ(సీఐసీఓ), చైనా ఫార్చ్యూన్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (సీఎఫ్‌ఎల్‌డీసీ)లు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపార భాగస్వామ్యం వహించేందుకు ఉత్సాహం చూపాయి.