ఘనంగా ఉమాకాంత్ పాటిల్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ ఆగస్టు 15 (జనంసాక్షి) జహీరాబాద్ సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సోమవారం ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో తెరాస నాయకులు కార్యకర్తలు లింగాయత్ సమాజ్ నాయకులు యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, అన్నదానం, ఆలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతికి సంగమేశ్వర స్వామి ఆలయములో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు, జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, అదేవిధంగా జహీరాబాద్ పట్టణంలో యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాం కార్యక్రమాలు నిర్వహించారు. కోహిర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు రాజయ్య స్వామి మాజీ అధ్యక్షులు సంగమేశ్వర పాటిల్ విజేందర్ రెడ్డి సర్పంచ్ పొరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్ సర్పంచులు, ఎంపీటీసీలు సంతోష్ పాటిల్ ఆయా మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.