ఘనంగా ఎస్ ఆర్ శంకరన్ జయంతి

మల్దకల్ అక్టోబర్ 22 (జనంసాక్షి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఎస్ఆర్ శంకరన్ 89వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శనివారము ఆయన విగ్రహానికి ఎంపీపీ రాజారెడ్డి,సర్పంచ్ యాకోబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాబి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇమాన్యులు, ఏపిఎం, సీసీ జయన్న, రాజు, శేఖర్, అమృత్ కుమార్, దివ్యాంగుల సంఘం సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.