ఘనంగా కేఎల్ నరసింహారావు 99వ జయంతి

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో ఆదివారం కీర్తిశేషులు కేఎల్ నరసింహారావు 99వ జయంతి స్థానిక గ్రంథాలయంలో నిర్మించిన విగ్రహం వద్ద గ్రామ వెలుగు నాట్యమండలి అధ్యక్షులు పొనుగోటి రంగా, కేఎల్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు పందిరి పుల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినారు. గ్రామ వెలుగు నాట్య మండలి అధ్యక్షులు పొనుగోటి రంగా మాట్లాడుతూ, కేఎల్ నరసింహారావు జీవితం నాటక జీవితం వారు తొలి తెలంగాణ మాండలిక భాషలో ఎన్నో నాటికలు, నాటకములు రాసినారని, వారు పుట్టింది పెరిగింది రేపాల గ్రామంలో వారు 1946లో గ్రామ వెలుగు నాట్యమండలిని స్థాపించారు. నాటి నుండి నేటి వరకు రేపాల గ్రామంలో వందల మందిని కళాకారులుగా తయారు చేసినారన్నారు. వారి జీవితం కళకే అంకితమైనదని, వారు రాసిన ఎన్నో పుస్తకాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చాలా పుస్తకాలు ఉన్నాయన్నారు. కేఎల్ నరసింహారావు జయంతిని ప్రభుత్వం నిర్వహించడం రేపాల గ్రామానికి వారు ఎంతో పేరు తెచ్చారని, వందలకు పైగా నాటికలు, నాటకాలు రాసి ప్రదర్శనలు నిర్వహించినారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వెలుగు నాట్యమండలి ప్రధాన కార్యదర్శి కుంటిగొర్ల కృష్ణమూర్తి, సీనియర్ కళాకారులు మాచర్ల రామయ్య, గుద్దేటి నరసయ్య, సొంటె పరుశరాములు, పొనుగోటి కోటయ్య, గవిని ఆంజనేయులు, జూనియర్ కళాకారులు మొగిలిచర్ల సత్యనారాయణ, తోకల సైదులు, కుంటిగొర్ల వెంకటేశ్వర్లు, గవిని చిన్న లక్ష్మీనరసింహం, గండు సత్యనారాయణ, పెద్దలు బెజవాడ సీతారాములు, బత్తుల నరసయ్య, ఆలగడప రమేష్, వరికల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.