ఘనంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం..

ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి..
హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి
జిల్లాలో గురువారం రోజున మార్కాజీ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు.స్థానిక కార్పొరేటర్ చెన్నం మధు కలిసి ప్రారంభించారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ   ప్రతి సంవత్సరం రెండు విడతలుగా విద్యార్థులలో మరియు 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్లో నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం చేపడుతున్నామని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా నులి పురుగుల వలన కడుపులో నొప్పి, రక్తహీనత మొదలగునవి ఏర్పడతాయని ముఖ్యంగా దీని నివారించుటకు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ముఖ్యంగా మలవిసర్జన తర్వాత భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అని ఆరుబయట మలవిసర్జన చేయరాదని మరుగుదొడ్లను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. గురువారం రోజున మొత్తం 2,13,402 మందికి అల్బెండ జోలే మాత్రలు ఇవ్వడం జరుగతుందని. ఎవరైనా ఈ మాత్రలు వేయించుకొనట్లైతే ఈ నెల 22వ తేదీన వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
స్థానిక కార్పొరేటర్  చెన్నం  మధు  మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుందని అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం వల్ల పిల్లలలో పోషకాహార లోపం లేకుండా చూస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మార్కాజీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఉమా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ని శ్రీమతి గీతాలక్ష్మి కార్యక్రమ ఉద్దేశాలను వివరిస్తు ఈ కార్య క్రమం విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ. ఇతర ప్రభత్వ విభాగాల సమన్వయము తో అంగన్ వాడి సెంటర్ ల లో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల లో మాత్రలను వెస్తున్నమన్నరు
ఇట్టి కార్యక్రమంలో స్థానిక అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రణధీర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, ఆర్ బి ఎస్ కే వైద్యాధికారులు డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ దివ్య, యూనిసెఫ్ ఎస్ బి సి సి కోఆర్డినేటర్  భాస్కర్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి రాజ్యలక్ష్మి, పి హెచ్ ఎన్ ప్రేమ లత, సి హెచ్ ఓ రవీందర్, సూపర్వైజర్లు ఏ. రమేషు, జె.రమేశ్, పీ. శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.