ఘనంగా పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు

జుక్కల్,ఆగస్టు18,జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో బహుజన పోరాటవేత్త సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం జై గౌడ ఉద్యమం మండల అధ్యక్షుడు కల్లేటి విట్టల్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమం జిల్లా ఉపాధ్యక్షులు పండరి గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. అనంతరం పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ,సర్పంచ్ తిరుమలరెడ్డి, అంజని గ్రామ అధ్యక్షులు లక్ష్మా గౌడ్, కాటేపల్లి గ్రామ అధ్యక్షులు రామా గౌడ్, కాస్లాబాద్ గ్రామ అధ్యక్షులు సాయ గౌడ్, వివిధ గ్రామాల జై గౌడ ఉద్యమ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.