రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. పదవ తరగతి 1992-93 బ్యాచ్ కి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంది వనపర్తి విద్యార్థులు బి.యన్ రెడ్డి నగర్, సాగర్ కాంప్లెక్స్ లో ఉన్న పద్మావతి కాన్ఫరెన్స్ హాల్ లో వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి గౌరవించుకున్నారు చిన్ననాటి జ్ఞాపకాలను.. మధుర స్మృతులను. ఒకరికొకరు పంచుకొని ఆనందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ఉపాధ్యాయులు బాబురావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తోటి వారికి సహాయపడాలని, మానవత్వాన్ని చూపాలని అసమానతలేని సమాజం రూపుదిద్దుకోవాలని అందుకు విద్యయే ముఖ్యమైన ప్రతి మనిషి బాధ్యతతో పనిచేసి సమాజ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు, ప్రతాపరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలను అలవర్చుకావాలని, పెద్దలను గౌరవించాలని, చదువుతోపాటు సంస్కారం కూడా ముఖ్యమని ప్రతి విద్యార్థి వినయ విధేయతలతో మెలగాలని చెప్పారు. పి ఈ టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం కావున వ్యాయామం, యోగ మన దినచర్యలో భాగమై ఉండాలని చెప్పారు, నారాయణ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు మంచి విద్యను అందించాలని విద్యే నిజమైన సంపదని అలాగే ప్రకృతిని ప్రేమించాలని, ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన వృత్తిని ఎంచుకొని సమాజానికి సేవ చేయాలని అలాగే జంతువులు, పక్షులపై ప్రేమ చూపాలని చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించాలని చెప్పారు కార్యక్రమంలో పూర్వపు ఉపాధ్యాయులు బాబురావు , ప్రతాప్ రెడ్డి ,ఆంజనేయులు , ఫక్రుద్దీన్ నారాయణరెడ్డి , వెంకటేశ్వరరావు , పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.