ఘనంగా పొలాల పండగ

జైనథ్ జనం సాక్షి ఆగస్టు 26
జైనథ్ మండల లో లక్ష్మీపూర్ గ్రామంలో పొలాల పండగ అంగరంగ వైభవంగా సాగింది పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఎడ్ల గుడి పడవ ప్రతి ఇంటి నుంచి ఎడ్ల మగవాళ్ళు కొత్తవి స్వీకరించి అవి అన్ని ఒకే తాటికి తెచ్చి ఒక గుడి పడవను తయారు చేస్తారు దానిని ఊరిలో మాధన్ అనే వ్యక్తి ఇంటి నుండి గుడి పడవను తయారుచేసి ఊరిలో బయలుదేరుతారు ఊరిలో ఉన్న హనుమాన్ మందిరాన్ని చుట్టూ తింపి హనుమాన్ మందిరంలో పూజ చేసి భాజభజంత్రీలతో ఊరేగింపుతో పోయి గాడిగే మారాజ్ మందిరం దగ్గర ఊరంతా సంత చేసి ఉన్న ఎడ్లు ను మొత్తం ఎడ్లను మీది కెళ్ళి గుడి పడవ దింపి అక్కడి నుండి సన్నాసనాంగ వస్తున్న ఆచారం ప్రకారం ఊరిలో ఉన్న పటేల్ ఎడ్ల జోడి ముందుకు పోవాలి ఆ ఆచారాన్ని లక్ష్మీపూర్ గ్రామంలో గత 35 ,40 సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం ప్రకారం వాళ్ల ఎడ్లని ఊరేగింపులో ముందుకు తీస్తారు ఇప్పటికి కూడా లోక రఘురాం రెడ్డి లక్ష్మీపూర్ గ్రామ పటేల్ గా పేరుగాంచిన వ్యక్తి వారి ఎడ్లని ఊరేగింపులు లేదా ఎడ్ల పందెంలో వారియర్లని ముందు వస్తాయి కొత్వాల్ కట్టిన తోరణం లో పటేల్ ఎడ్ల ముందు వరుసలో ప్రతి సంవత్సరం వస్తాయి కొత్వాల్ కట్టిన తోరణాన్ని గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మీ రాములు ఆ తోరణాన్ని తెంపడం జరుగుతుంది ఎవరు అయితే గ్రామ సర్పంచిగా ఉంటారు వారు మాత్రమే ఆ తోరణాన్ని తెంపుతారు అది గత 50 సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం ఈ పొలాల పండుగకు లక్ష్మీపూర్ గ్రామంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మీ రాములు ఉపసర్పంచ్ ఘాజంగుల స్వామి గ్రామ కొత్వాల్ మడావి సంతోష్ గ్రామ పటేల్ లోక రఘురాం రెడ్డి గ్రామ మదనగా పిలువబడే వ్యక్తి చిప్ప భగవాన్ మాజీ వి డి సి చైర్మన్ sorth శోభన్ ఉషోదయ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు దాసరి ప్రభాకర్ మరియు ప్రధాన కార్యదర్శి మర్యాద అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.