ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 17(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని 32 డివిజన్లోని వినాయక కాలనీలో పోచమ్మ బోనాలు బుధవారం ఘనంగా నిర్వహించారు .ఈ పండుగలో కార్పోరేటర్ పల్లం పద్మా రవి పాల్గొని మాట్లాడుతూ శ్రావణమాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలు నిర్వహించుకుంటున్నాం అన్నారు .అంటువ్యాధులు ప్రబలకుండా పోచమ్మ పండుగ నిర్వహించడం మన సంస్కృతిలో భాగమని తెలిపారు .ఈ సందర్భంగా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కార్పొరేటర్ వివరించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రామగిరి శోభన్, శ్రీకాంత్ ,ప్రవీణ్, నక్క చేరాలు, మహిళలు పాల్గొన్నారు