ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో183వ ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఎర్రవెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ మిత్రులందరికీ 183 వ,ప్రపంచ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎర్రం ఉదయ్, ఉపాధ్యక్షులు చాపిడి రవీందర్, కోశాధికారి గాదాసు కనకరాజు, గౌరవఆధ్యక్షులు గోక శ్రీనివాస్, కార్యదర్శి బద్రి సతీష్ , సిద్ధం సతీష్, ముఖ్య సలహాదారుడు సిహెచ్ కుమార్, ప్రచార కార్యదర్శి బండి అరుణ్ కుమార్, యూనియన్ సభ్యులు నాగేందర్, రవీందర్, సంధాని, గిరిబాబు, బనేష్, కిషన్, వెంకటేష్, నాగరాజు,స్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.