ఘనంగా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు

నల్లబెల్లి ఆగస్టు 18 (జనం సాక్షి):
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలను మండలంలోని శనిగరం క్రాస్ పెట్రోల్ బంకు వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల బ్రతుకులు మారాలంటే  ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
వైనాలా అశోక్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కుసుంబా రఘుపతి,మండల నాయకులు మాలోతు మోహన్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పెంతల కొమురారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఇస్తారి శేఖర్, జెట్టి రామ్మూర్తి, నారక్కపేట ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, అజ్మీర తిరుపతి, మోహన్, పోగుల కుమారస్వామి, వైనాల పవన్, సుధాకర్, కర్ణాకర్, ఇంద్రారెడ్డి ,రాజు, రాంబాబు, కోటి పాల్గొన్నారు.