ఘనంగా లూయిస్ డాగురే జయంతి వేడుకలు.
ఫోటో రైటప్: కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఫొటోగ్రాఫర్లు.
బెల్లంపల్లి, ఆగస్టు19, (జనంసాక్షి)
కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 183 జయంతి వేడుకలను నెన్నెల మండల కేంద్రంలో ఫొటోగ్రాఫర్లు, విడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ మండల అధ్యక్షుడు సుంకరి తిరుపతి మాట్లాడుతూ ఫొటో మరియు వీడియో గ్రాఫర్లు అందరూ సోదరభావంతో మెదిలి వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రత్నం శ్రీనివాస్, గట్టు సంతోష్, మండలంలోని ఫొటో మరియు విడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.