ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నా గౌడ్ 372 వ జయంతి వేడుకలు

హుజూర్ నగర్ ఆగస్టు 18 (జనం సాక్షి): తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం              హుజూర్ నగర్ టౌన్ హాల్ నందు  బహుజన వీరుడు సర్దార్ సర్వయి పాపన్నా గౌడ్ 372 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పాపాన్నా ఘన చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నాయకులు బహుజన నాయకులు  మాట్లాడుతూ అప్పటి కాలంలో మొఘల్ రాజుల పెత్తందారులను, జమీందారులను వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ లో ఉన్న సంపద మొత్తన్నీ బహుజన వర్గాలకు పంచిన బహుజన పోరాట యోధుడు సర్దార్ పాపాన్నా గౌడ్, సర్దార్ చరిత్రను ప్రపంచనికి తెలియకుండా దాచిన సమయంలో లండన్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పాపాన్నా చరిత్రను బయటకు తీశారు, ఎస్సీ , ఎస్టీ,  బీసీ మైనారిటీ కులాలు ఏకం ఐ రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గుండు రాంబాబు గౌడ్, జెనిగల శ్రీనివాస్ గౌడ్ ,తండు వెంకన్న గౌడ్, పట్టణ నాయకులు గండు అర్జున్ గౌడ్, వల్లపుదాసు నాగరాజు గౌడ్, బత్తిని ఉదయ్ గౌడ్, చామకూరి నరసింహారావుగౌడ్, ఓరుగంటి  రామకృష్ణ గౌడ్, అడ్వకేట్ బాలాజీ నాయక్ ,శీతల రోషిపతి, ఎలుక సోమయ్య గౌడ్  తదితరులు పాల్గొన్నారు.