ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
– గౌడ జన హక్కుల పోరాట సమితి, బీసీ సంఘం ఆధ్వర్యంలో….
బూర్గంపహాడ్ ఆగష్టు18 (జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణంలో గౌడ జన హక్కుల పోరాట సమితి, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు కేశగాని శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మాంకాళి రామారావు, కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372, వ జయంతి వేడుకలు గురువారం ఉదయం 9 గంటలకు సారపాక సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జాగీర్దారులు, భూస్వాములు చేసే దురాగతాలను అంతమొందించడానికి గోల్కొండ కోటపై బడుగు, బలహీనల జెండాను ఎగురవేయాలని, గెరిల్లా సైన్యాన్ని తయారుచేసి గోల్కొండ కోట పై బడుగు బలహీనవర్గాల జెండాను ఎగురవేసిన గొప్ప చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, అలాంటి గొప్ప చక్రవర్తి బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరన్న గౌడ్, బుల్లి వీరభద్రం గౌడ్, రామ్ ప్రసాద్ గౌడ్, బూర శ్రీనివాస్ గౌడ్, భిక్షపతిగౌడ్, సురేందర్ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెండి చంద్రశేఖర్, చీమలపాటి కోటేశ్వర్రావు, మండల అధ్యక్షుడు దాసరి సాంబ, వెళ్లి శెట్టి రామారావు, వివిధ రాజకీయ నాయకులు ఏనుగుల వెంకట్ రెడ్డి, సానికొమ్ము శంకర్ రెడ్డి, మువా వెంకటేశ్వర్రావు, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.