ఘనంగా హిందీ దివాస్

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (14) జనంసాక్షి న్యూస్
ఘనంగా హిందీ దివాస్
భారతదేశంలోని 22 భాషల్లో ఒక భాష అయినా హిందీని 1953 సెప్టెంబర్ 14 నాడు జాతీయ భాషగా రాజ్యాంగంలో పొందుపరిచిన సందర్భాన్ని హిందీ దివాసుగా జరుపుకుంటున్నారని ముల్కనూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. బుధవారం నాడు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హిందీ భాష ఔన్నత్యాన్ని తెలిపే ఆర్ట్స్ గ్యాలరీ చార్ట్స్ ప్రదర్శన ఇతర ఎగ్జిబిట్లను విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు.
ఈ  సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వీరేశం, హిందీ ఉపాధ్యాయులు సంపత్ ,అనిత ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.