చంద్రయాన్‌-2 సక్సెస్‌తో ఉలిక్కిపడ్డ అమెరికా

దాదాపు 50 ఏళ్ల క్రితమే జాబిల్లిని ముద్దాడిన అమెరికా తదుపరి పరిశోధనలకు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉందన్న ప్రశ్న వేసుకుంటే అనేకానేక అనుమానాలు దొంతర్లలా దొర్లుతాయి. యూట్యూబ్‌ తెరిస్తే చంద్రుడిపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కాలిడింది నిజమేనా అన్న అనుమానాలు మనలను వెంటాడుతాయి. ఆనాడు చంద్రుడిపై కాలుడిన విషయంలో ప్రపంచ దేశాల్లో అనుమానాలు ఉన్నాయి. రాష్యా పరిశోధనలకు పోటీగా ఈ కుట్ర జరిగిందన్న వాదనలూ ఉన్నాయి. ఈ యాత్రలో పాల్గొన్న నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కూడా ఇప్పుడు  మనమధ్యలో లేడు. అయినా ఆనాటి ప్రాజెక్క్టు సంబంధించిన వారు ఉన్నారు. ఒకవేళ నాసా పరిశోధనలు నిజమైతే ఈ యాభై ఏళ్ల కాలంలో చంద్రుడిపై మరిన్ని పరిశోధనలకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. నాసా ప్రయోగించిన అపోలో 50 ఏళ్ల ప్రస్థానం తరవాత ఇన్నాళ్లకు మనం చంద్రయాన్‌ను ప్రవేశ పెట్టాం. దీంతో భారత అంతరిక్షరంగ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పరిశోధక పరికరాలతోపాటు 130 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ‘చంద్రయాన్‌-2’ నిర్ణీత కక్ష్యలోకి చేరింది. బాహుబలి వాహకనౌక ‘జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3-ఎం1’ తనపై ఇస్రో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వ్యోమనౌకను రోదసిలోకి మోసుకెళ్లింది. భూకక్ష్యలోకి దాన్ని చేర్చింది. దీంతో జాబిల్లిపైకి మనదేశం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రెండో యాత్రలో తొలి అంకం విజయవంతంగా పూర్తయింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ వేదికగా ఈ బృహత్తర ప్రయోగం జరిగింది.  రాకెట్‌ నుంచి ‘చంద్రయాన్‌-2’ విడిపోయినట్లు సంకేతాలు అందగానే ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ అపూర్వ ఘట్టంతో యావత్‌ భారతావని పులకించింది. ‘చంద్రయాన్‌-2’ లో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ అనే మూడు పరికరాలు ఉన్నాయి. వీటిలో పరిశోధనల కోసం 13పేలోడ్స్‌ను శాస్త్రవేత్తలు అమర్చారు.ఈ ఏడాది సెప్టెంబరు 7న చంద్రుడిపై ల్యాండర్‌ దిగనుంది. అందులో నుంచి రోవర్‌ బయటకు వచ్చి 14 రోజులపాటు పరిశోధనలు జరుపుతుంది. మనం రోవర్‌ను పంపడానికే ఇంతకాలం పరిశోదనలు చేసి ముందడుగు వేస్తే 50 ఏళ్లుగా అమెరికా ఏం చేస్తోంద్నది ప్రపంచానికి అర్థం కాని ప్రశ్నగా,అనుమానంగా మారింది. తొలిసారిగా చంద్రునిపైకి మనిషిని పంపి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా… మరో చరిత్రాత్మక ప్రాజెక్టుకు ‘నాసా’ శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించింది.  2024లో తొలిసారిగా ఓ మహిళను, తదుపరి పురుషుడిని జాబిల్లిపైకి పంపాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. మరో ఐదేళ్ల కాలం ఎందుకన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. మన జాబిల్లి యాత్ర చేపట్టిన రోజు నాసాకు 50 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలు గుర్తుకు వచ్చాయా అన్నది ప్రశ్న. 50 ఏళ్ల క్రితమే వ్యోమగాములను పంపినప్పుడు ఎన్నెన్నో పరిశోధనలు జరగాలి. మన చంద్రయాన్‌ 1లో పంపిన  రోవర్‌ చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని గుర్తించింది. అప్పుడు కూడా నాసా అభినందించిందే తప్ప తన మున్ముందు లక్ష్యాలను ప్రకటించలేదు.  1960లో ‘అపోలో’ ద్వారా చంద్రుడిపైకి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను  పంపినట్లు ప్రకటించిన  నాసా… ఇప్పుడు  జాబిల్లిపైకి మహిళను పంపుతానని ప్రకటించింది. సమస్త మానవాళి కోసం మరో బృహత్తర కార్యక్రమం చేపట్టే అవకాశం మాకొచ్చింది. తదుపరి తరానికి చెందిన స్పేస్‌ లాంచ్‌ సిస్టం రాకెట్‌ను ప్రయోగించనున్నాం. జాబిల్లి ఉపరితలంపై నీరు, మంచు వంటి సహజ వనరుల ఉనికిని తెలుసుకోవడానికి, అంగారకునిపై తదుపరి పరిశోధనలకు ఈ కార్యక్రమం దారి చూపనుంది. లోగడ అక్కడ సందర్శించని కొత్త ప్రాంతాలను ఈ యాత్రికులు వెలుగులోకి తెస్తారు. 2028 నాటి కల్లా చంద్రునిపై మనిషి స్థిరమైన ఉనికిని చాటుతాం. అమెరికా సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాము లతో కలిసి ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం అని నాసా అధిపతి జిమ్‌ బ్రిడెన్‌స్టైన్‌ వివరించారు. ఇప్పటికే కెనడీ స్పేస్‌ సెంటర్‌లో ఇంజినీర్లు ఒరాయన్‌ క్రతువులో నిమగ్నమయ్యారని ప్రకటించారు. 2024లో చంద్రునిపైకి వ్యోమగాములను పంపడానికి ముందస్తుగా… వచ్చే ఏడాది ఒరాయన్‌, ఎస్‌ఎల్‌ఎస్‌లను అమెరికా ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి పంపి, పరీక్షించనుందని వెల్లడించింది. ఇన్నాళ్లూ అమెరికా గడ్డ విూద నుంచి రోదసిలోకి రాకెట్లు పంపుతున్నాంగానీ… త్వరలోనే అంతరిక్ష పరిశోధకులను చంద్రునిపైకి పంపి అక్కడే సాంకేతిక, వనరుల అభివృద్ధి చేపడతామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెల్లడించారు. ఈసారి మా వ్యోమ గాములు చంద్రుడిపైకి వెళ్లి అక్కడే ఉండి మా ఉనికిని చాటుతాం. సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తాం. చంద్రుని పైనుంచి అంగారకుడికి మా ప్రయాణం కొనసాగుతుందని ఆయన వివరించారు. ఆర్టెమిస్‌ కార్యక్రమం ద్వారా 2024లో చంద్రుడిపైకి పరిశోధకులను పంపనున్న నాసా… వారిని అక్కడే ఉంచనున్నట్టు తెలుస్తోంది. తర్వాతి దశలో భాగంగా చంద్రుని పైనుంచి అంగారకుడి వద్దకు రాకెట్‌ను పంపనుందని ప్రకటించుకుంది. అయితే దీనికి ఇంతకాలం ఎందుకు తీసుకుందన్నదే ప్రశ్న. సాధారణంగా నాసా ప్రయోగాలు చురుకుగా ఉంటాయి. భారత్‌ జాబిల్లి యాత్రను చేపట్టిన వెంటనే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. దీంతో గతంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ యాత్ర నిజామా కాదా అన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. మన పరిశోధనలు మరింత వేగంగా ముందుకు సాగుతున్న వేళ త్వరలోనే ప్రపంచానికి జాబిల్లి రహస్యాలు వెల్లడి కానున్నాయి. అలాగే జాబిల్లిపై నాసా పంపిన అపోలో కాలిడిందా లేదా అన్నది కూడా తెలుస్తుంది. ప్రపంచ ప్రజల్లో ఉన్న అనుమానాలను నాసా ఏనాడూ పట్టించుకోలేదు. చంద్రుడిపై అమెరికా కాలిడి వుంటే అంగారక ప్రయోగాలు మరింత వేగం పుంజుకునేవి. మన అంగారక యాత్ర, జాబిల్లి యాత్రలు చూస్తుంటే మనమే ముందుగా వ్యోమగాములను చంద్రుఇపైకి పంపగలమన్న విశ్వాసం ప్రపంచప్రజల్లోనూ నెలకొంది. అంతరిక్షపరంగా భారత్‌ వేస్తున్న అడుగులు ప్రపంచానికి దిక్సూచి అవుతాయనడంలో సందేహం లేదు. ఇస్రో పరిశోధనలు విశ్వానికి మార్గదర్శిగా నిలుస్తాయని భావిద్దాం.