చట్టబద్ధతలేని లంబాడలను ఎస్టి జాబితల నుండి తొలగించాలని డిమాండ్.
నెరడిగొండసెప్టెంబర్15(జనంసాక్ షి):
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు బుర్సా పొచ్చన్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
లంబాడలను ఎస్టీ జాబితల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ అదిలాబాద్ నుండి జోడెన్ ఘాట్ వరకు పాదయాత్రనుఈ నెల12నుండి
20వరకు అదిలాబాద్ జిల్లా కమిటీ ఆయ డివిజన్ మండల కమిటీలు అను బంధసంగలు
ఆయా గ్రామాల ప్రజలు పటేళ్లు సార్మీడిలు నాయకులు అదిలాబాద్ నుండి జోడెన్ ఘాట్ వరకు జరిగే పాదయాత్రని శ్రీకారం చుట్టారు.గురువారం రోజున మండల కేంద్రంలో ని కొమరం భీం విగ్రహాన్ని పూలమాలలు వేసి ఆదివాసీల భవనం నుండి జోడే ఘాట్ పాదయాత్రకు బయల్దేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టబద్ధతలేని లంబాడలను ఎస్టీ,జాబిత నుండి తొలగించాలిఆదివాసులు సాగుచేస్తున్నా అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
పేసా1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
జిఓ నెంబర్ 3ను యధావిధిగా అమలు చేయాలని
నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామలుగా గుర్తించాలని జిల్లావ్యాప్తంగా
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కొడప నగేష్ తొడసం శంకర్ సంబన్న సోనెరావు జంగు తదితరులు ఉన్నారు.
Attachments area