చనిపోయిన వ్యక్తులు కూడా ఉపాధి హామీ
మార్చి 03 గాంధారి. ( జనం సాక్షి)
ఉమ్మడి నిజాంబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా లో చనిపోయిన వ్యక్తులు కూడా ఉపాధి హామీ పని చేయడంతో పాటు మాస్టారు రికార్డులలో సంతకాలు పెడుతున్నారు మరియు రాజకీయ వ్యక్తుల కుటుంబంలో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది కి మాస్టారు రికార్డులలో సంతకాలు పెట్టి ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారు పలు గ్రామాలలో సర్పంచ్ కొడుకులు మాస్టారు రికార్డుల్లో సంతకాలు ఉంటున్నాయి అమ్మాయిని మరొకరి ఇంటికి పెళ్లి చేశాక కూడా సంతకాలు పెట్టి ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు అంటే ఎంత దారుణం ఇకనైనా అధికారులు దీనిపైన స్పందించి ఇలాంటి అవకతవకలు ఏమన్నా ఉంటే సరి చేసుకోవాలని కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ల సమాచారం మేరకే ఈ వార్త రాస్తున్నాము కాబట్టి దీని పైన దృష్టి పెట్టాలని అధికారులను కోరుతున్నాము