చాకలి ఐలమ్మ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ చేసిన మంత్రి అల్లోల

  నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్19,జనంసాక్షి,,, నిర్మల్ పట్టణం వివేక్ చౌక్(మయూరి హోటల్ ముందర) నూతనంగా ప్రతిష్టాపన చేయనున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణానికి సోమవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ గారు  భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం,భుక్తి కోసం,దోపిడీ,పీడన నుంచి విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో  చాకలి ఐలమ్మ పాత్ర కీలకం అని అన్నారు. ప్రభుత్వం తరపున ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. పట్టణంలో ని ధర్మసాగర్ వద్ద పటేల్ మహరాజ్ విగ్రహానికి స్థలాన్ని కేటాయించామని, త్వరలోనే విగ్రహ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణంలో ని మున్సిపల్ చౌరస్తాలో మొల్ల కవయిత్రి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా చరిత్ర కారులను స్మరిస్తూ వారి యొక్క అడుగుజాడల్లో పయనిస్తుందని తెలిపారు.ప్రభుత్వం చాకలి కులస్తులకు లాండ్రీ లలో ఉచితంగా విద్యుత్ ను ఇస్తుందని దోబీ ఘాట్ ల వద్ద ఎలక్ట్రానిక్ వాషింగ్ మెషిన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మున్సిపల్ చౌరస్తా వద్ద మొల్ల కవయిత్రి విగ్రహ స్థలం ఏర్పాట్లను పరిశీలించారు
.కమిషనర్ అరిగెల సంపత్ కుమార్,డి.ఈ నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక వెంకటరమణ, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,పట్టణ కౌన్సిలర్లు, రజక, కుమ్మరి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.