చార్టెడ్ అకౌంట్ లో ప్రతిభ కనపరిచిన సాయి శ్వేత

పినపాక నియోజకవర్గం జూలై 15 జనం సాక్షి ప్రతిభ ఉంటే లక్ష సాధనలో పేదరికం అడ్డు కాదని సాయి శ్వేత నిరూపించారు. మండలం పీకే వన్ సెంటర్ కు చెందిన పసుపులేటి సాయి శ్వేత చార్టెడ్ అకౌంట్ లో ప్రతిభను కనబరిచారు. సాయి శ్వేత ఉండేది చిన్న రేకుల ఇల్లు అయితేనే తన కన్న కలలను తల్లిదండ్రుల సహకారంతో విజయం సాధించారు నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి సిఏ లో విజయం సాధించిన ఆమె చిన్నప్పటినుంచి చదువులో దిట్టా… స్థానిక ఎక్స్లెంట్ హై స్కూల్ నందు ఒకటి నుంచి పదవ తరగతి లో 9.7 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఖమ్మం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి 1000కి 958 మార్కులు సాధించి అబ్బురపరిచారు. ఆ తర్వాత గుంటూరు మాస్టర్ మైండ్ కాలేజ్ నందు సి ఎ లో శిక్షణ పొందింది. ఈ పరీక్షలలో 1 59 176 మంది రాయగా 30 వేల మంది ఉత్తీర్ణులయ్యారు.అందులో సాయి శ్వేత ఉండటం విశేషం.
సాయి శ్వేత ప్రేరణ
చిన్నప్పటినుంచి ప్రతి దాన్ని తెలుసుకోవాలన్న తపన బోలెడు విషయాలను నేర్పిస్తుంది. నాన్న పసుపులేటి శ్రీనివాస్ (వాసు) మణుగూరు ఉపరితల గనిలో డంపర్ ఆపరేటర్ (ప్రవేటు ఉద్యోగి) గా పనిచేస్తున్నారు. అమ్మ పసుపులేటి రమాదేవి గృహిణి నేను పెద్దమ్మాయినీ కుటుంబంలోని చిన్న చిన్న విషయాలన్నీ ముందుగా నాకు తెలిసేవి ఈ కష్టం మీరు పడకూడదని మంచిగా చదువుకోవాలి మా నాన్నగారు ఎప్పుడు చెబుతుండేవారు. ఆ ప్రేరణ తో ఏదైనా ఖాళీ సమయం దొరికితే వార్తాపత్రికలు, కథలు పుస్తకాలు చదివేదాన్ని ఆ ప్రేరణ చదువుకోవాలన్న తపన కలిగించింది. ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యం ఏర్పరుచుకోవాలి ఆ లక్ష్యం తో ప్రయత్నం చేస్తే విజయం మన సొంతమవుతుందన్న విశ్వాసం ఏర్పడింది ఆర్థిక కష్టపడి చదివి తొలి ప్రయత్నం లోనే సి ఏ విజయం సాధించి తన కలలను సహకారం చేసుకున్నాను. ఈ విజయం వెనుక మా అమ్మ నాన్న ల ఆర్థిక, ఆకలి కష్టాలు ఎన్నో ఉన్నాయి మా నాన్నగారి స్నేహితులు ఆర్థిక సహకారం చేసి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు