చికిత్స పోందుతూ మహిళ మృతి-డాక్టర్ల నిర్లక్షమే కారణమంటూ ఆందోళన

గోదావరిఖని: డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని వనం కనకయ్య అనే కార్మికుడు సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తే సరైన వైద్యం అందించకుండా డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని ఆరోపించాడు. సమయానికి వైద్యం అందకపోవటం వల్లనే తన భార్య మరణించిందని ఆసుపత్రి సూపరిడెంట్‌ గది ముందు మృత దేహాన్ని పెట్టి ఆందోళకు దిగాడు. డిప్యూటీ సూపరిడెంట్‌ సంఘటనపై విచారించి బాద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో అతను ఆందోళన విరమించాడు.