చివరి త్రైమాసికం సర్‌ఛార్జి ప్రతిపాదన

యూనిట్‌కు రూపాయి

హైదరాబాద్‌: 2012-13 చివరి త్రైమాసిక సర్‌ఛార్జి ప్రతిపాదనలను డిస్కంలు ఈరోజు ఈఆర్‌సీకి సమర్పించాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాడిన విద్యుత్‌కు రూ.1137 కోట్లు సర్‌ఛార్జిలను డిస్కంలు ప్రతిపాదించాయి. తొలి మూడు నెలల్లో వాడిన విద్యుత్‌కు యూనిట్‌కు అదనంగా రూ. 1 వసూలు చేస్తామని డిస్కంలు ఈఆర్‌సీని కోరాయి.