చెడు వ్యసనంతో భవిష్యత్తు వినాశనం
జ్యోతినగర్, జూన్ 26, (జనం సాక్షి) చెడు వ్యసనం యువత భవిష్యత్తు వినాశనానికి దారి తీస్తుందని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్ అన్నారు. మాదక ద్రవ్యాల నిషేధ దినోత్సవంను పురస్కరించుకుని ఎన్టీపీసీ పోలీసులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భగా సీఐ మాట్లాడుతూ… యువకులు అప్రమత్తతో… భవిష్యత్ మార్గాన్ని సుగమం చేసు కోవాలని కోరారు. జడ్‌పిహెచ్‌ఎస్, విశ్వభారతి హైస్కూల్ విద్యార్థులు, ఆదర్శయూత్, భగవతీ యూత్ విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ ఎఫ్‌సిఐ రోడ్ నుంచి మేడిపల్లి సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎస్‌ఐ బి.ఉపేందర్, ఏఎస్‌ఐ రాజేశం తదితరులు పాల్గొన్నారు.
యైటింక్లయిన్‌కాలనీలో… టూటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిషేధ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భగా సీఐ ఆర్.ప్రకాష్ మాట్లాడుతూ… యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని… కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.