చెరువుకు గండి కొట్టిన మున్సిపల్ కమిషనర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి

తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరేంకల నరసింహ

సాగర్ రహదారిపై రాస్తారోకో భారీగా ట్రాఫిక్ జాబ్

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- ఇబ్రహీంపట్నం చెరువుకు గండి కొట్టిన మున్సిపల్ కమిషనర్ యూసఫ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మత్స్య కారులు సాగర్ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న మత్స్య కారులను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అరెస్టుకు నిరసనగా మత్స్య కారులకు మద్దతుగా బీజేపీ చెరువుల పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ మత్స కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా బీజేపీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జక్క రవిందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 20 ఏండ్లుగా ఇబ్రహీం పట్నం చిన్న చెరువులో అక్రమ నిర్మాణాలు జరుతున్నయని అనేక మార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు ఇండ్ల లోనికి నీరు వస్తుందని తుములో నుండి నీళ్ళు తీయడం దారుణం మని అన్నారు. పై ఆదికారుల ఆదేశాలు లేకుండా మున్సిపల్ కమిషనర్ తూముల నుండి నీటిని తీయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. వాకింగ్ పార్క్ పెరుతో లక్షల రూపాయలు పెట్టీ నిర్మాణం చేశారని ఇప్పుడు నీరు నిదింది. ప్రజాధనం వృద చేశారని చెప్పారు. సంబంధిత అధికారులు పై వాల్ట్ చట్టం క్రింద కేసు నమోదు చేయాలనీ లేని పక్షం లో ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స కార్మిక సంఘం నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.