చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దు

తహశీల్దార్ లూధర్ విల్సన్

, జులై 13, జనంసాక్షి: భారీ వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ లూధర్ విల్సన్ కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా అవసరమైన సమయంలో రెవిన్యూ శాఖ తగు చర్యల చేపట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. మండలంలోని గుండ్లరేవు, బేతాళపాడు, కరివారిగూడెం ప్రాంతాల్లో పెద్దవాగు, తుమ్మలవాగు పరివాహక ప్రాంతాల వద్దకు ప్రజలు అసలు వెళ్లొద్దని కోరారు. భారీ వర్షాల కారణంగా ఈ వాగులకు వరద ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. సూరారం ప్రాంతంలోని రాళ్లు వాగు కూడా పొంగి ప్రవహించే అవకాశం ఉందని అన్నారు. చెరువుల్లోకి వరద నీరు చేరుతున్న దృష్ట్యా చెరువుల వద్దకు అసలు వెళ్లొద్దని కోరారు. వరద వచ్చే సమయంలో వాగులు, రోడ్లు, వంతెనలను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. మండలంలో వరదల పరిస్థితిని రెవిన్యూ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తుందని తెలిపారు. ముఖ్యంగా కరెంట్ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు అటవీ ప్రాంతాల నుంచి వరద దిగువకు వస్తున్నందున పలు రకాల పాములు నీటితో కొట్టుకు వస్తాయని, ఈ పరిస్థితుల్లో విష సర్పాలతో కూడా ప్రమాదం ఉంటుంది. వీటి వలన జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.