చెరువు కట్ట మరమ్మతులు పరిశీలించిన సర్పంచ్.. వడ్డేపల్లి మల్లారెడ్డి

బచ్చన్నపేట సెప్టెంబర్ 25 (జనం సాక్షి) ఎంగిలిపూల బతుకమ్మను వేయడానికి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మండల కేంద్రంలో ఉన్నటువంటి సౌటకుంట. గోధుమ కుంట చెరువులను మహిళలకు అనుకూలంగా సదును చేసినట్లు బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి తెలిపారు. ఆదివారము వార్డు మెంబర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ బతుకమ్మలు వేయడానికి వెళ్లే మార్గంలో చెట్లు గడ్డి లాంటివి లేకుండా డోజర్ తో చదును చేయడం జరిగిందని తెలిపారు. రాత్రి సమయంలో గ్రామపంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉంటూ పర్యవేక్షిస్తారని అన్నారు. ఒకప్పుడు బతుకమ్మ పండుగ సమయంలో నీళ్లు లేక గుంతలు తవ్వి నీళ్లు ఏర్పాటు వారమని కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ప్రతి చెరువు ప్రతికుంట నీళ్లతో కలగాలాడుతూ పాడిపంటలతో రైతన్నలు సంతోషంగా ఉన్నారన్నారు. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకునే ఆడపడుచులు పండుగను ఆనందంగా జరుపుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన జరుగుతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నాయకత్వంలో బచ్చన్నపేట మండలం అభివృద్ధి పథంలో నడుస్తుందని వారన్నారు. వార్డ్ మెంబర్లు కరుణాకర్ రెడ్డి. జంధ్యాల ఉపేందర్. కా మిడి శ్రీనివాస్ రెడ్డి. పందిపెళ్లి రాజు ఉన్నారు