చైనాకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

C

పెట్టుబడులే లక్ష్యం

పది రోజుల పర్యటన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జనంసాక్షి): ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన  సీఎం కె.చంద్రశేఖర్‌రావు చైనాలోని డాలియన్‌కు చేరుకున్నారు. పది రోజుల పర్యటన నిమిత్తం ఆయన  హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చైనాకు బయలుదేరిన విషయం తెలిసిందే. డాలియన్‌ నగరంలో ఈనెల 9 నుంచి 11 వరకు న్యూ ఛాంపియన్‌షిప్‌-2015 పేరిట జరుగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ సదస్సులో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమల సాధనే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. డాలియన్‌లో ఆయన షాంగ్రిల్లా ¬టల్‌లో బస చేయనున్నారు. కాగా, చైనా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జీ జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్‌రెడ్డి, జంగినపల్లి సంతోశ్‌కుమార్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఐజీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ ఐజీ భగవత్‌ మహేశ్‌మురళీధర్‌, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, మిషన్‌ మేనేజర్లు జగదీశ్‌ రామడుగు, శివాని శంకర్‌ (సీవీఎస్‌)లతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు వెళ్లారు.