చౌరస్తా అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవంతమైన రక్తదాన శిబిరం.
రక్త దానం చేయుటకు యువత ముందుకు రావాలి.
రెడ్ క్రాస్ జిల్లా యూత్ కన్వీనర్ డి. కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 4(జనంసాక్షి):
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో చౌరస్తా అసోసియేషన్ అధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటి నాగర్ కర్నూల్ వారి సహకారంతో స్వచ్చంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంలో యూత్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ డి. కుమార్ మాట్లాడుతూ… చౌరస్తా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవతి ఉత్సవాలను పురస్క రించుకుని ఏర్పాటు చేసిన స్వచ్చంద రక్తదాన శిబిరంలో యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని, అన్ని దానాలలో రక్తదానం ముఖ్యమైనదని, రక్తదానం ప్రాణదానం తో సమానమని,జిల్లాలోని యువత రక్తదాన శిబిరాల నిర్వహణకు ముందుకు రావాలని ఈ సంద్భంగా కోరారు.
ఈ శిబిరంలో 32 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటి సభ్యులు కృష్ణా రావు,చౌరస్తా అసోసియేషన్ సభ్యులు శివ శంకర్ రెడ్డి, దివ్య రెడ్డి, అరుణ్ సాయి, వంశీ, వరుణ్, లక్ష్మారెడ్డి, నరసింహ స్వామి, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.