జగన్నాధ్‌ పూర్‌ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి

మంచిర్యాల,జూలై2(జ‌నం సాక్షి): కాగజ్‌నగర్‌ మండలం పెద్ద వాగుపై రూ. 240కోట్లతో నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టును మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే పొనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్సీ పురాణ సతీశ్‌ సోమవారం సందర్శించారు. ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.