జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
జగిత్యాల,జూన్6(జనం సాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గొల్లపల్లి మండలం చిల్వకుడూరు గ్రామ శివారులోని వంతెన దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు గొల్లపల్లి మండలం చెందొలి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు చిప్ప రాములు, చిప్ప సందీప్ మరియు చిప్ప వినోద్ లు గా గుర్తించారు. ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. చనిపోయిన వారు జగిత్యాల నుండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.